రొటీన్ సినిమా అయినా జ‌నాలు చూస్తున్నారు..!

యువ హీరో రామ్  ఈ మ‌ధ్య  ప్ర‌యోగ‌ల జోలికి వెళ్ల‌డం లేదు. త‌న ప‌ర్స‌నాలిటికి అవి పెద్ద‌గా సెట్ కాక పోవ‌డంతో.. రొటిన్ అయిన‌ప్ప‌టికి.. క‌మ‌ర్షియ‌ల్ ఫార్ముళాలో ట్రావెట్ అవుతున్నాడు. అలా  వ‌చ్చిందే  పండ‌గ చేస్కో చిత్రం.  ర‌వితేజ తో బ‌లుపు చిత్రం  త‌రువాత‌. .డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని  హీరో రామ్ తో చేసిన ఈ చిత్రం   గ‌తంలో శీను వైట్ల  చేసిన రెడి ఫార్మేట్ ను పోలి వుంది.  ఆల్మోస్ట్‌ అలాగే ఉంది.
     అయిన‌ప్ప‌టికి    స‌గుటు ప్రేక్ష‌కులు అవేమి ప‌ట్టించుకోవ‌డం లేదు. థియేట‌ర్స్ లో  సినిమాను అస్వాదిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా  పండ‌గ చేస్కుంటున్నారు.  లేటుగా వ‌చ్చినా  .హీరో రామ్ లేట్ గా వ‌స్తాడ‌నుకుంటే..  రోటిన్ గా వ‌చ్చి… మెప్పించి   ఒక స‌క్సెస్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు మ‌రి.
     ఈ చిత్రంలో   రామ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీతిసింగ్ న‌టించింది.  బ్ర‌హ్మానందం  రెడి చిత్రంలో మాదిరి  కీ రోల్ చేశాడు.   కోన వెంక‌ట్..గోపి మోహ‌న్ మాట‌లు.. డైలాగ్స్ అందించారు.    ఆడియ‌న్స్ సినిమా న‌వ్విస్తే చాలు అనుకునే ప‌రిస్థితిలో వుండ‌టంతో.. రోటిన్ క‌థ‌ల‌కు సేఫ్ జోన్ దొరికిన‌ట్లు అయ్యింది మ‌రి.