Telugu Global
Others

అసెంబ్లీ నుంచి రేవంత్ బ‌హిష్క‌ర‌ణ‌?

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్క‌రించాల‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆయనపై వేటు వేయ‌డానికి టీఆర్ఎస్‌ రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు డబ్బులు ఎర‌చూపి దొరికిపోయిన నేపథ్యంలో… రేవంత్‌పై ‘కఠిన’ చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు సాగుతున్నాయనే ప్రచారం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సాగుతోంది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని రేవంత్‌ను అసెంబ్లీ నుంచి డిస్మిస్‌ చేయాలనే డిమాండ్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. తెలంగాణలో తొలి […]

అసెంబ్లీ నుంచి రేవంత్ బ‌హిష్క‌ర‌ణ‌?
X
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్క‌రించాల‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆయనపై వేటు వేయ‌డానికి టీఆర్ఎస్‌ రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు డబ్బులు ఎర‌చూపి దొరికిపోయిన నేపథ్యంలో… రేవంత్‌పై ‘కఠిన’ చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలు సాగుతున్నాయనే ప్రచారం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సాగుతోంది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని రేవంత్‌ను అసెంబ్లీ నుంచి డిస్మిస్‌ చేయాలనే డిమాండ్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌కు రేవంత్‌ ఆదినుంచీ కంట్లో నలుసుగా మారారు. ఆయన అనేక సందర్భాల్లో సూటిగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రేవంత్ అనేక విష‌యాల్లో నేరుగా కేసీఆర్‌ని టార్గెట్ చేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యులైన ఎంపీ క‌విత‌, మంత్రి కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీష్‌రావుల‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ యావత్తు రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసింది. జాతీయ గీతాన్ని అవమానించారంటూ బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఇది రేవంత్‌ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప‌నిగానే చెబుతున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ అనేలా ‘అప్రకటిత యుద్ధం’ జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీకి ఉన్న నిబంధ‌న‌ల చ‌ట్రంలో ఒక సభ్యుడిని స‌భ‌ కొనసాగినంత కాలం సస్పెండ్‌ చేయటం, అత‌ని సభ్యత్వాన్ని రద్దు చేయ‌డం… వంటి అధికారం అధికార‌ప‌క్షానికి ఉంటుంది. ఈక్రమంలో రేవంత్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలా? సభకు రాకుండా సస్పెన్షన్‌ వేటు వేయాలా? అనే అంశంపై టీఆర్‌ఎస్‌ ముఖ్యుల్లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2005లో పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే అభియోగంపై 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ రద్దు చేశారు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని రేవంత్‌పై స‌భ నుంచి బ‌హిష్క‌ర‌ణ వేటు వేయాల‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.
First Published:  1 Jun 2015 9:20 PM GMT
Next Story