Telugu Global
Cinema & Entertainment

క‌ర‌ణ్ జోహార్ దొర‌క‌డం ల‌క్కీ ...

ఒక ప్రాంతీయ భాష‌లో రెండు వంద‌ల కొట్లు బ‌డ్జెట్ అంటే  సాధార‌ణ విష‌యం కాదు.  అసాధార‌ణ విష‌యం అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. మ‌న సినిమాకు వున్న మార్కెట్ ప‌రిధి స‌గ‌టున 30 కోట్లు .  స్టార్  హీరోల చిత్రాల‌కు  పెడుతున్న భారీ బ‌డ్జెట్   రీత్యా వాళ్ల  చిత్రాల‌కు  ప్రాఫిట్స్  వ‌చ్చే విష‌యం శూన్య‌మ‌నే చెప్పాలి.  పెట్టిన పెట్టుబ‌డి తిరిగి వ‌స్తే చాలు అన్న‌ట్లుంటుంది ప‌రిస్థితి.   అయితే బాహుబ‌లి చిత్రంతో  తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఒక […]

క‌ర‌ణ్ జోహార్ దొర‌క‌డం ల‌క్కీ ...
X

ఒక ప్రాంతీయ భాష‌లో రెండు వంద‌ల కొట్లు బ‌డ్జెట్ అంటే సాధార‌ణ విష‌యం కాదు. అసాధార‌ణ విష‌యం అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. మ‌న సినిమాకు వున్న మార్కెట్ ప‌రిధి స‌గ‌టున 30 కోట్లు . స్టార్ హీరోల చిత్రాల‌కు పెడుతున్న భారీ బ‌డ్జెట్ రీత్యా వాళ్ల చిత్రాల‌కు ప్రాఫిట్స్ వ‌చ్చే విష‌యం శూన్య‌మ‌నే చెప్పాలి. పెట్టిన పెట్టుబ‌డి తిరిగి వ‌స్తే చాలు అన్న‌ట్లుంటుంది ప‌రిస్థితి.

అయితే బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఒక కొత్త అధ్యాయం రాస్తున్నాడు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్న లీడ్ రోల్స్ లో తెలుగు తో పాటు..త‌మిళ్ , హింది భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో చాల రిచ్ గా ఒక పిరియాడిక్ ఫిల్మ్ ను రెండు భాగాలుగా చేశారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ఇత‌ర ద‌ర్శ‌కులు సినిమా పూర్తి చేసి నిర్మాత మీద వ‌దిలేస్తారు. నిర్మాత‌కు వున్న మార్కెట్ అనుభ‌వం రిత్యా బిజినెస్ చేసుకుంటారు. అయితే ఇక్క‌డ బాహుబ‌లి సినిమాకు రాజ‌మౌళి ని మార్కెట్ ప‌ర్స‌న్ గా అవ‌త‌రించ‌డం కూడా విశేషం. సినిమా డే వ‌న్ నుంచి ప్ర‌చారం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వుంటూ.. బాహుబ‌లి సినిమాకు సంబంధించిన చిన్న న్యూస్ అయిన బంగార‌మే అన్నంత హైపు ను క్రియోట్ చేసేశాడు. దీంతో బాహుబ‌లి సినిమాకు తెలుగులో ప్ర‌చారం కోసం ప్ర‌త్యేకంగా వేడుక‌లు చేయాల్సిన ప‌రిస్థితి అవ‌స‌రం లేద‌నేది రాజ‌మౌళి గ‌ట్టి న‌మ్మ‌కం. ఇది నిజ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక హింది లో ఈ సినిమాను ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. రాజ‌మౌళి క‌ర‌ణ్ జోహార్ ను అప్రోచ్ అయ్యి.. ఒప్పించ‌డం సినిమాకు ప్ల‌స్ అనే చెప్పాలి. ఎందుకంటే..కర‌ణ్ జోహార్ కూడా సినిమా ప్ర‌చారం విష‌యంలో చాల తెలివిగా చేయ‌గ‌ల డైరెక్ట‌ర్. మీడియా వాళ్లు ఒక్క ప్ర‌శ్న వేస్తే ..ఆయ‌న ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల స‌మ‌ర్ధుడు. మంచి మాట‌కారి. సినిమాను ప్ర‌మోష‌న్ చేయ‌డంలో దిట్ట‌. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కూడా చాల యాక్టివ్ గా వుంటాడు. ఆయ‌న‌కు ఫాలోయ‌ర్స్ రేంజ్ ఎక్కువే. ఇలా చూస్తే.. రాజ‌మౌళి సినిమాను ప‌ర‌భాష‌ల్లో విడుద‌ల చేసే వారి విష‌యంలో చాల స్కానింగ్ చేసుకుంటూ ఎంచుకుంటున్నాడ‌నే చెప్పాలి. ఇక త‌మిళ్ లో స్టూడియో గ్రీన్ వాళ్లు బాహుబ‌లిని రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మీద హిందీ వెర్ష‌న్ కు హండ్రెట్ ప‌ర్సెంట్ సినిమాకు ప్ల‌స్ అయ్యే వ్య‌క్తిని స‌మ‌ర్పికుడిగా ప‌ట్టుకోవ‌డం ల‌క్ అనే చెప్పాలి.

First Published:  2 Jun 2015 4:40 AM GMT
Next Story