పూరీ జ‌గ‌న్నాధ్ ఏం చేస్తాడో…!

కెరీర్ ప‌రంగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న చార్మి ..తాజాగా  డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ తో క‌ల‌సి చేసిన  జ్యోతిల‌క్ష్మి చిత్రం పై భారీ అంచ‌నాలు ..ఆశ‌లు పెట్టుకుంది.   డైరెక్ట‌ర్  పూరీ కూడా  ఈ చిత్రంతో  చార్మి కి మంచి హిట్ ఇవ్వాల‌నే త‌లంపుతోనే వ‌ర్కువుట్ చేసిన‌ట్లున్నారు.  సినిమా ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే అభిమానుల్లో  భారీ అంచ‌నాలు పెంచాయి.    చార్మి  క్యారెక్ట‌రైజేష‌న్ లో భిన్న‌మైన షేడ్స్  కనిపిస్తున్నాయి.   ప్ర‌ముఖ న‌వ‌ల రాచ‌యిత  మ‌ల్లాది వెంక‌ట్ కృష్ణ మూర్తి   రాసిన మిసెస్ ప‌రాంకుశం అనే న‌వ‌ల ఆధారంగా  జ్యోతిల‌క్ష్మీ సినిమా  తెర‌కెక్కింది.  పూరీ మార్క్ మేకింగ్  ఈ సినిమాకు క‌చ్చితంగా ప్ల‌స్ పాయింట్ అవుతుంది అంటున్నారు చిత్ర యూనిట్. 
తాజాగా  జ్యోతిలక్ష్మీ టైటిల్ సాంగ్  రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమా మేకింగ్ విజువ‌ల్స్ కూడా అభిమానుల్ని అల‌రిస్తున్నాయి. త్వ‌ర‌లో చిత్రం రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 12న విడుద‌ల కావోచ్చ‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది.