Telugu Global
Others

రేవంత్‌రెడ్డిలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైందా?

ఓటుకు నోటు కేసులో ఏసీబీ అరెస్టు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై అంత‌ర్మ‌థ‌నం మొద‌లైందా? జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. మొద‌ట స్టీఫెన్ ఇంట్లో అరెస్టుచేసిన‌పుడు కేసీఆర్ ను బూతులు తిట్టి, మీసం మెలేసిన రేవంత్‌లో కొద్దిగంట‌ల త‌రువాత మార్పు వ‌చ్చింద‌ట‌. ఆయ‌న స్టీఫెన్‌కు లంచం ఎర‌జూపుతున్న వీడియోలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయ‌ని స‌హ‌చ‌రుల ద్వారా తెలుసుకున్న రేవంత్‌రెడ్డి క‌న్నీళ్లుపెట్టుకుని, ఏడ్చార‌ని స‌మాచారం. ఏసీబీ అధికారులు విచారిస్తున్న స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి క‌న్నీళ్లు పెట్టుకున్నారంటూ మీడియాలో క‌థ‌నాలు […]

రేవంత్‌రెడ్డిలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైందా?
X
ఓటుకు నోటు కేసులో ఏసీబీ అరెస్టు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై అంత‌ర్మ‌థ‌నం మొద‌లైందా? జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. మొద‌ట స్టీఫెన్ ఇంట్లో అరెస్టుచేసిన‌పుడు కేసీఆర్ ను బూతులు తిట్టి, మీసం మెలేసిన రేవంత్‌లో కొద్దిగంట‌ల త‌రువాత మార్పు వ‌చ్చింద‌ట‌. ఆయ‌న స్టీఫెన్‌కు లంచం ఎర‌జూపుతున్న వీడియోలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయ‌ని స‌హ‌చ‌రుల ద్వారా తెలుసుకున్న రేవంత్‌రెడ్డి క‌న్నీళ్లుపెట్టుకుని, ఏడ్చార‌ని స‌మాచారం. ఏసీబీ అధికారులు విచారిస్తున్న స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి క‌న్నీళ్లు పెట్టుకున్నారంటూ మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అంటే త‌న బాస్ మెప్పు పొందేందుకు అంతా ద‌గ్గ‌రుండి వ్య‌వ‌హ‌రించిన రేవంత్‌రెడ్డి ఇక‌పై త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు మ‌స‌క‌బారనుంద‌ని తెలియ‌డమే ఇందుకు కార‌ణం. మొద‌టి నుంచి దూకుడుగా వ్య‌వ‌హ‌రించే రేవంత్ త‌న భ‌విష్య‌త్తును అదే దూకుడు ప్ర‌మాదంలో ప‌డేసింద‌ని తెలిసి కుమిలిపోతున్నాడ‌ని స‌మాచారం.
నేరం రుజువైతే బ‌ర్త‌ర‌ఫ్‌?
నేరం రుజువైతే రేవంత్‌కు ఆరు నెల‌ల నుంచి గ‌రిష్టంగా.. 5 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశాలున్నాయి. రెండేళ్ల‌కుమించి శిక్ష‌ప‌డితే ఉన్న‌ప‌లంగా ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అవుతాడు. భ‌విష్య‌త్తులోనూ ఎలాంటి రాజ్యాంగ ప‌ద‌వులు చేప‌ట్ట‌కూడ‌దు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కేసు ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. పైకోర్టులో విముక్తి ల‌భించ‌డంతో ఆమె తిరిగి ప‌ద‌వి చేప‌ట్టారు.కానీ రేవంత్‌కు ఆ అవ‌కాశాలు దాదాపుగా లేవు. సాక్ష్యాలు ప‌క్కాగా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో అప్ప‌ట్లో అమ‌ర్‌సింగ్‌, పీవీ న‌ర‌సింహారావుల రాజ‌కీయ జీవితం తెర‌మ‌రుగైన‌ట్లే త‌న‌కూ అలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని రేవంత్ ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు ఈవిష‌యంపై త‌మ బాస్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం, ఎలాంటి ఖండ‌న‌లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డమూ ఒక‌రంగా వ్యూహాత్మ‌క‌మే. ఈ ప‌రిస్థితుల్లో రేవంత్‌కు మ‌ద్ద‌తిస్తే.. త‌న ప్ర‌తిష్ట‌కు మ‌చ్చ వ‌స్తుంద‌ని ఆయ‌న భావించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇది రేవంత్ ను మ‌రింత క్షోభ‌కు గురిచేస్తోంద‌ట‌. మ‌రోవైపు ఈ విష‌యంలో వైస్సార్ సీపీ కూడా విమ‌ర్శ‌లు పెంచింది. త‌మ నాయ‌కుడిని త‌ర‌చుగా ఏ-1గా అభివ‌ర్ణించే రేవంత్ ఇప్పుడు ఏ-1గా పోలీసుల‌కు నేరుగా చిక్క‌డంపై నిల‌దీస్తున్నారు. చంద్ర‌బాబు అస‌లు ఏ-1 అని అత‌నిని ఎందుకు వ‌దిలార‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తోంది. ఈ ప‌రిణామాలు రేవంత్‌ను మాన‌సికంగా మ‌రింత కుంగ‌దీస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
First Published:  2 Jun 2015 12:21 AM GMT
Next Story