ఇక బాబు పాల‌న‌పై స‌మ‌ర‌మే: ర‌ఘువీరా

తెలుగుదేశం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 6న రాజ‌మండ్రిలో ర‌ణ గ‌ర్జ‌న పేరుతో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తుంద‌ని ఏపీ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి తెలిపారు. అలాగే 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నామ‌ని, ఆరోజు టీడీపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల కాపీల‌ను ద‌గ్ధం చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీల‌న్నీ తుంగ‌లోకి తొక్కి జ‌నాన్ని చంద్ర‌బాబు మోసం చేస్తున్నాడ‌ని ర‌ఘువీరా ఆరోపించారు. ఇక ఈ ప్ర‌భుత్వంపై నిత్యం ప్ర‌జా పోరాటాలు నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల టీడీపీ నిర్వ‌హించింది మ‌హానాడు కాద‌ని, అదొక ద‌గానాడు అని ఆయ‌న విమ‌ర్శించారు.