Telugu Global
Others

స్థానిక సంస్థ‌ల బ‌లోపేతం: కేటీఆర్‌

స్థానిక సంస్థ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని, ఇందులో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని సాధ్య‌మైనంత ఎక్కువ చేస్తామ‌ని తెలంగాణ ఐ.టి. మంత్రి కె.తార‌క‌రామారావు తెలిపారు. బుధ‌వారం ఆయ‌న పంచాయ‌తీ రాజ్ శాఖ‌పై నివేదిక‌ను విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే తాండాల‌కు గ్రామ పంచాయ‌తీ హోదా క‌ల్పిస్తామ‌ని, పంచాయ‌తీలో 65 శాతం ప‌న్నులు వ‌సూలు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ‘ప్ర‌జా ప‌న్నుల‌తో ప్ర‌జ‌ల ప‌నులు’  అనే నినాదంతో త‌మ ప్ర‌భుత్వం ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే 1000 కిలోమీట‌ర్ల రోడ్లు నిర్మించామ‌ని, […]

స్థానిక సంస్థ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని, ఇందులో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని సాధ్య‌మైనంత ఎక్కువ చేస్తామ‌ని తెలంగాణ ఐ.టి. మంత్రి కె.తార‌క‌రామారావు తెలిపారు. బుధ‌వారం ఆయ‌న పంచాయ‌తీ రాజ్ శాఖ‌పై నివేదిక‌ను విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే తాండాల‌కు గ్రామ పంచాయ‌తీ హోదా క‌ల్పిస్తామ‌ని, పంచాయ‌తీలో 65 శాతం ప‌న్నులు వ‌సూలు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ‘ప్ర‌జా ప‌న్నుల‌తో ప్ర‌జ‌ల ప‌నులు’ అనే నినాదంతో త‌మ ప్ర‌భుత్వం ముందుకు వెళుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే 1000 కిలోమీట‌ర్ల రోడ్లు నిర్మించామ‌ని, గ్రామీణ ర‌హ‌దారుల‌కు ఇరువైపులా మొక్క‌ల‌ను నాట‌తామ‌ని ఆయ‌న చెప్పారు. రూ. 5400 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని, 36.5 ల‌క్ష‌ల మందికి ఆస‌రా పింఛ‌న్లును అందిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. వాట‌ర్ గ్రిడ్ ప‌థ‌కం అమ‌లైతే ప్ర‌తిప‌క్షాల‌కు పుట్ట‌గ‌తులుండ‌వ‌నే భ‌యంతోనే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఈ ప‌థ‌కం పూర్త‌యితే తెలంగాణ ప్రాంతానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.
First Published:  2 Jun 2015 1:26 PM GMT
Next Story