Telugu Global
NEWS

జూన్ 15లోగా టీచ‌ర్ల నియామ‌కాలు: గ‌ంటా

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విశాఖ‌ప‌ట్నంలో విడుదల చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా  3,68,161 మంది పరీక్షలు రాశారని చెప్పారు. వారిలో 1,38,344 మంది (37.57 శాతం) అర్హత సాధించారని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజెస్) పరీక్ష రాసిన వారిలో 32.65 శాతం , స్కూల్‌ అసిస్టెంట్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌) పరీక్ష రాసిన వారిలో 32.89 శాతం , ఎస్‌జీటీ […]

జూన్ 15లోగా టీచ‌ర్ల నియామ‌కాలు: గ‌ంటా
X
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విశాఖ‌ప‌ట్నంలో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,161 మంది పరీక్షలు రాశారని చెప్పారు. వారిలో 1,38,344 మంది (37.57 శాతం) అర్హత సాధించారని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజెస్) పరీక్ష రాసిన వారిలో 32.65 శాతం , స్కూల్‌ అసిస్టెంట్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌) పరీక్ష రాసిన వారిలో 32.89 శాతం , ఎస్‌జీటీ పరీక్ష రాసిన వారిలో 60.80 శాతం, లాంగ్వేజ్‌ పండిట్స్‌ పరీక్ష రాసిన వారిలో 29.23 శాతం , పీఈటీ పరీక్ష రాసిన వారిలో 100 శాతం మంది క్వాలిఫై అయ్యారని ఆయ‌న చెప్పారు. రాత పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 60, బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ , వికలాంగ (పిహెచ్‌)అభ్యర్థులకు 40 మార్కులను క్వాలిఫైయింగ్‌ మార్కులుగా నిర్ణయించారు. ఫలితాలు
http://apdsc.cgg.gov.in
వెబ్‌సైట్లో చూసుకోవచ్చని ఆయ‌న తెలిపారు. రాత పరీక్షలకు సంబంధించి ప్రొవిజనల్‌ జాబితాలను తొమ్మిదో తేదీకల్లా జిల్లాలకు పంపిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆయా జిల్లాల్లో పోస్టుల ఆధారంగా రోస్టర్‌ పాయింట్లు రూపొందించి జాబితా ఖరారు చేస్తారని వివరించారు. జిల్లాల వారీగా జాబితాలు తయారైన తరువాత జూన్‌ 15లోగా నియామకాల పూర్తిచేయాలని భావిస్తున్నామని మంత్రి చెప్పారు.
First Published:  2 Jun 2015 9:32 PM GMT
Next Story