Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి రిలీజ్ ఫిక్స్ చేయ‌లేదా..?

తెలుగు సినిమా ప్రేక్ష‌క లోకం అంతా ఎంతో ఆస‌క్తిగా  వెయిట్ చేస్తున్న డేట్ జూలై 10.  ఈ తేదిన  బాహుబ‌లి విడుద‌ల‌వుతుందని ఇప్ప‌టి వ‌ర‌కు  ఒక హ‌ల్ చ‌ల్ మీడియాలో న‌డుస్తుంది.  ఇప్ప‌టికే ట్రైల‌ర్ వ‌దిలేసి.. సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో రుచి చూపించాడు.  దీంతో  అభిమ‌నాలు కౌంట్ డౌన్ కౌంట్ చేసుకుంటున్నారు.  అయితే తాజా స‌మాచారం ఏమిటంటే..  బాహుబ‌లి రిలీజ్ విష‌యంలో  రాజ‌మౌళి ఇంకా ఎటువంటి ముగింపుకి రాలేద‌నేది  చిత్ర యూనిట్ లో గ‌ట్టిగా […]

బాహుబ‌లి రిలీజ్ ఫిక్స్ చేయ‌లేదా..?
X

తెలుగు సినిమా ప్రేక్ష‌క లోకం అంతా ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్న డేట్ జూలై 10. ఈ తేదిన బాహుబ‌లి విడుద‌ల‌వుతుందని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక హ‌ల్ చ‌ల్ మీడియాలో న‌డుస్తుంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ వ‌దిలేసి.. సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందో రుచి చూపించాడు. దీంతో అభిమ‌నాలు కౌంట్ డౌన్ కౌంట్ చేసుకుంటున్నారు.

అయితే తాజా స‌మాచారం ఏమిటంటే.. బాహుబ‌లి రిలీజ్ విష‌యంలో రాజ‌మౌళి ఇంకా ఎటువంటి ముగింపుకి రాలేద‌నేది చిత్ర యూనిట్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న వాద‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడియో విడుద‌ల తేది గురించి మాత్ర‌మే ఓపెన్ గా ఎనౌన్స్ చేశాడు కానీ.. సినిమా రిలీజ్ విష‌యం ఖ‌రా కండిగా చెప్పింది లేదు. ఇదిలా వుంటే బాహుబ‌లి ని హిందిలో స‌మ‌ర్పిస్తున్న క‌ర‌ణ్ జోహార్ మాత్రం య‌మ స్పీడ్ గా వున్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈ చిత్రం జులై 10న హిందిలో రిలీజ్ అవుతుంద‌ని ఎనౌన్స్ చేశాడు. ఇదే డేట్ తో ఒక పేప‌ర్ యాడ్ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఒక వైపు స‌మ‌ర్పకులు.. మ‌రో వైపు కోట్లాది మంది ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తుంటే.. రాజ‌మౌళి మాత్రం బాహుబ‌లి విడుద‌ల విష‌యంలో ఇంత సైలెంట్ గా ఉండ‌టం ఏమిటో ఆయ‌న‌కే తెలియాలి.

First Published:  3 Jun 2015 4:36 AM GMT
Next Story