ఎసీబీ వ‌ద్ద బాబు-రేవంత్ ఫోన్ సంభాష‌ణ‌లు:  హోంమంత్రి

ఓటు కొనుగోలు వ్య‌వ‌హారంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లు అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) వ‌ద్ద ఉన్నాయ‌ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయ‌ని న‌ర‌సింహ‌రెడ్డి తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో తామేమీ జోక్యం చేసుకోమ‌ని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని ఆయ‌న అన్నారు. చ‌ట్టానికి వ్య‌క్తుల‌తో సంబంధం ఉండ‌ద‌ని, దాని ప‌రిధిలో అది ప‌ని చేస్తుంద‌ని నాయ‌ని అన్నారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో అస‌లు సూత్ర‌ధారి చంద్ర‌బాబునాయుడేన‌ని ఆయ‌న ఆరోపించారు.