మ్యాగిపై దేశ‌వ్యాప్తంగా నిషేధం!

మ్యాగీపై ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు నిషేధం విధించింది. మ్యాగీ సురక్షితం కాని ఆహారపదార్థంగా ఢిల్లీ సర్కార్‌ ప్రకటించింది. కేంద్రీయ బండార్‌ సహ ప్రభుత్వ దుకాణాలు అన్నింటిలోనూ మ్యాగీ అమ్మకాలు నిషేధించారు. ఇప్పటి వరకు మొత్తం 10 రాష్ర్టాలు మ్యాగీపై నిషేధం విధించడం లేదా వాటి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించడం చేశాయి. అటు మ్యాగీపై ప్యూచర్‌ గ్రూప్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. బిగ్‌ బజార్‌ స్టోర్స్‌ నుంచి మ్యాగీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నిజానిజాలు నిగ్గు తేలేవరకు అమ్మకాలు చేపట్టబోమని స్పష్టం చేసింది. బిగ్‌ బజార్‌ బాటలోనే మరికొన్ని సూపర్‌ బజార్లు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు మ్యాగీపై పరీక్షలు జరపాలని అన్ని రాష్ట్రాల‌ను ఎఫ్‌సీఐ ఆదేశించింది. దోషులుగా తేలితే చర్యలు తప్పవని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నెస్లే ఇండియా షేర్లు పతనమయ్యాయి.