Telugu Global
Others

7న వైసీపీలోకి బొత్స.. వెన్నంటే అనుచ‌ర గ‌ణం

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ నెల 7 న ముహూర్తం పెట్టుకున్నారు బొత్స స‌త్యనారాయ‌ణ. వాస్త‌వానికి ఆయ‌న 3వ తేదీన జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి స‌మ‌ర‌దీక్ష చేప‌డుతున్న మంగ‌ళ‌గిరిలో పార్టీలో చేరాల‌నుకున్నారు. కాని అనుచ‌రుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు కొంత స‌మ‌యం తీసుకుంటే బాగుంటుంద‌ని భావించి ఆయ‌న త‌న చేరిక‌ను 7వ తేదీకి వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతోపాటు త‌న చేరిక‌తో పాటు మ‌రికొంత‌మందిని వైసీపీలోకి తీసుకురావాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా విజ‌య‌వాడ‌లో ఆయ‌న మ‌కాం వేసి […]

7న వైసీపీలోకి బొత్స.. వెన్నంటే అనుచ‌ర గ‌ణం
X

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ నెల 7 న ముహూర్తం పెట్టుకున్నారు బొత్స స‌త్యనారాయ‌ణ. వాస్త‌వానికి ఆయ‌న 3వ తేదీన జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి స‌మ‌ర‌దీక్ష చేప‌డుతున్న మంగ‌ళ‌గిరిలో పార్టీలో చేరాల‌నుకున్నారు. కాని అనుచ‌రుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు కొంత స‌మ‌యం తీసుకుంటే బాగుంటుంద‌ని భావించి ఆయ‌న త‌న చేరిక‌ను 7వ తేదీకి వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతోపాటు త‌న చేరిక‌తో పాటు మ‌రికొంత‌మందిని వైసీపీలోకి తీసుకురావాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా విజ‌య‌వాడ‌లో ఆయ‌న మ‌కాం వేసి కొంత‌మంది త‌న అనుచ‌రుల‌తోను, మ‌రికొంత‌మంది స‌న్నిహితుల‌తోను చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ అంశాల‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని బొత్స ముహూర్తాన్ని ఖ‌రారు చేసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా బొత్స వెంటే తామంతా ఉంటామంటూ ఏపీ కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి ఎడ్ల రమణమూర్తి ప్రకటించారు. దీంతో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

First Published:  2 Jun 2015 1:17 PM GMT
Next Story