Telugu Global
Others

రేవంత్ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డ మీడీయా...!

ఓటుకు నోటు ఎర‌జూపిన కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన సంగ‌తి తెలిసిందే! ఆ స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి త‌మ బాస్ తో స‌హా, కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కులు, మీడియా ప్ర‌ముఖుల పేర్లు కూడా ప్ర‌స్తావించాడు. ఓ వ‌ర్గం మీడియా మొత్తం మ‌న‌కే అనుకూలంగా ఉంద‌ని డాబులు పోయాడు. రేవంత్‌రెడ్డి అరెస్ట‌యిన కొద్దిసేప‌టి నుంచే రేవంత్‌రెడ్డి వీడియోల్లో ప్ర‌స్తావించిన మీడియా, ఈ వ్యవహారం మొత్తాన్నీ ప్రసారం చేసిన తీరు ఆయ‌న మాట‌లకు బ‌లం చేకూర్చింది.      ఇత‌ర పార్టీలు […]

రేవంత్ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డ మీడీయా...!
X

ఓటుకు నోటు ఎర‌జూపిన కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన సంగ‌తి తెలిసిందే! ఆ స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి త‌మ బాస్ తో స‌హా, కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కులు, మీడియా ప్ర‌ముఖుల పేర్లు కూడా ప్ర‌స్తావించాడు. ఓ వ‌ర్గం మీడియా మొత్తం మ‌న‌కే అనుకూలంగా ఉంద‌ని డాబులు పోయాడు. రేవంత్‌రెడ్డి అరెస్ట‌యిన కొద్దిసేప‌టి నుంచే రేవంత్‌రెడ్డి వీడియోల్లో ప్ర‌స్తావించిన మీడియా, ఈ వ్యవహారం మొత్తాన్నీ ప్రసారం చేసిన తీరు ఆయ‌న మాట‌లకు బ‌లం చేకూర్చింది.
ఇత‌ర పార్టీలు చిన్న నేరానికి పాల్ప‌డినా, చిన్న అవినీతి కేసులో ఇరుక్కున్నా దేశం నాశ‌నం అయిపోతోందంటూ.. ఏడుపులు, పెడ‌బొబ్బ‌లు పెట్టే తెలుగు మీడియా ఈ ఉదంతంలో రేవంత్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వడంపై జ‌నం ఆశ్చర్యపోతున్నారు. ఇత‌రుల‌కో న్యాయం, తమ వాళ్ళకి మ‌రో న్యాయ‌మా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇత‌ర పార్టీ నాయ‌కుల‌ను దొంగ‌లుగా, దేశ‌ద్రోహులుగా అభివ‌ర్ణించే ఆ మీడియా ఈ కేసులో ఏక‌ప‌క్షంగా వార్త‌లు రాయ‌డాన్ని ప్ర‌జ‌లు తప్పుబడుతున్నారు. అవినీతి కేసులో ఇరుక్కున్న ఓ ఎమ్మెల్యేది త‌ప్పు కాదు అని అర్థం వ‌చ్చేలా క‌థ‌నాలు ప్ర‌చురించ‌డంపై జ‌నం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. జాతీయ మీడియా రేవంత్‌రెడ్డిని దోషిగా చూపిస్తుంటే ఏపీ మీడియా ఆ సాహ‌సం ఎందుకు చేయ‌లేక‌పోతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
ఉచ్చు అంటూ క‌థ‌నాలు:
లంచం ఇవ్వ‌జూపిన రేవంత్ చేసింది తప్పు కాదన్నట్లు, అత‌నిని ఇరికించిన ఏసీబీ, తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎంల‌ది త‌ప్పు అనే అర్థం వ‌చ్చేలా వార్తలు అందిస్తున్నారు. మీడియాలో వచ్చిన మొత్తం వార్తలు ఒక ఎత్తైతే, ఇంకో గంటలో మీరో ముఖ్యమైన వార్త వినబోతున్నారు అంటూ కేసీఆర్ అన్నట్లుగా ఒక దిన పత్రికలో వచ్చిన ఒకే ఒక వాక్యం ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీవ్రంగా బదనామ్ చేసింది.

First Published:  3 Jun 2015 1:07 AM GMT
Next Story