సోనాక్షి సిన్హా ఎక్క‌డ‌…!

 బాలీవుడ్ లో బ్యాగ్రౌండ్  లేకుండా  రాణించ‌డం మ‌రీ క‌ష్టం.  ఎందుకంటే  అదోక పెద్ద స‌ముద్రం. అంత మాత్రాన ఫీల్మీ బ్యాగ్రౌండ్ ఒక్క‌టే  నిల‌బెడుతుంది అని చెప్ప‌లేరు.  ఎందుకంటే..  సినిమా నేప‌ధ్యం అనేది కేవ‌లం  తెరంగ‌ట్ర‌మ్ చేయ‌డానికే  స‌హాయ ప‌డుతుంది..  అలా  సోనాక్షి సిన్హా కు కూడా  వాళ్ల  ఫాద‌ర్ శ‌త్రుఘ్న సిన్హా  పేరు అంత వ‌ర‌కు ఉప‌యోగ ప‌డింది.  స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ద‌బంగ్(2010 విడుద‌ల‌) చిత్రంతో  తెరంగ‌ట్ర‌మ్ చేసింది.  ఈ చిత్రంలో సోనాక్షి ని చూసిన ఫిల్మ్ మేక‌ర్స్  అంతా…ఈ బొద్దుమ్మాయి ఇక్క‌డ నిల‌బ‌డ‌టం క‌ష్టం అనే టాక్ వినిపించింది.

 కానీ  విమ‌ర్శ‌కుల అంచ‌నాల్ని తారు మారు చేస్తూ ..  ద‌బంగ్ ఇచ్చిన స‌క్సెస్ తో   వ‌ర‌స‌గా మూడు సంవ‌త్స‌రాల పాటు వెన‌క్కు తిరిగి చూసుకునేటంత గ్యాప్ లేకుండా బిజీ అయ్యింది. అయితే ఆ త‌రువాత అక్ష‌య్ కుమార్ తో చేసిన  రౌడి రాథాడ్ వంటి చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది.  కానీ స‌క్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయ‌లేక ఈ మ‌ధ్య చ‌తికిల ప‌డ‌టంతో  ప్ర‌స్తుతం  సోనాక్షి సిన్హా వెన‌క బ‌డింద‌నే టాక్  వినిపిస్తుంది.

ఇక గ‌త యేడాది   ద‌క్షిణాది న లింగ చిత్రంలో   మెరిసింది. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న మంచి రోల్ చేసి మెప్పించింది. అయితే కెరీర్ కు పెద్ద‌గా ఉప‌యోగ ప‌డే రోల్ మాత్రం కాలేక పోయింది. న‌టిగా మంచి మార్కులే తెచ్చింది. ఇక  అర్జున్ క‌పూర్ తో చేసిన తేవార్ చిత్రం  కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్దగా  ఆడ‌క పోవ‌డంతో   సోనాక్షి సిన్హా కు కెరీర్ ప‌రంగా మైన్ స్ అయ్యింది.  అయితే  టాలెంట్ వున్న యాక్ట‌రెస్ కాబ‌ట్టి  త్వ‌ర‌లో బ్యాన్స్ బ్యాక్ అవుతుంద‌ని ఆశిస్తున్నారు ఆమే ఫ్యాన్స్. సోనాక్షి సిన్హా  ప్ర‌స్తుతం  అకీరా  అని పేరు తో ముర‌గ‌దాస్ డైరెక్ట్ చేస్తున్న  చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.