కేసీఆర్‌పై కొండా దంప‌తుల అల‌క!

సంచలనాలకు కేంద్ర బిందువైన కొండా మురళీధర్‌రావు, సురేఖ దంపతులు మరో సంచలనానికి తెరతీస్తున్నారా..? వరంగల్‌ జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. కొంతకాలంగా కొండా దంపతులు ఇద్దరూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత నెల 28న టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకుడు వాసుదేవరెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరైన సందర్భంలోనూ.. వీరిద్దరు మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే సురేఖ పాల్గొనలేదు. హరీశ్‌రావు నిర్వహించిన శాఖాపరమైన సమీక్షా సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు. బలమైన కారణాలతోనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాము పార్టీలో చేరినప్పుడు తమకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని కొండా దంపతులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.