Telugu Global
Others

చిక్కుల్లో చంద్ర‌బాబు!

ఓటుకు నోటు ఎర చూపిన కేసులో అస‌లు సూత్ర‌ధారి ఏపీ సీఎం చంద్ర‌బాబేన‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని బుధ‌వారం స్వ‌యంగా తెలంగాణ హోంమంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి ప్ర‌టించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం కార‌ణంగా మూడురోజుల నుంచి చంద్ర‌బాబు క‌ల‌త చెందార‌ని, స‌రిగా నిద్ర‌పోవ‌డం లేదంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు నాయిని ప్ర‌క‌ట‌న బ‌లం చేకూరుస్తుంది. అయితే సూత్ర‌ధారి ముఖ్య‌మంత్రి హోదాలో ఉండ‌టంతో ఇంత‌కాలం ప్ర‌క‌టించ‌డానికి స‌మ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అన్ని ఆధారాలు ప‌క్కాగా […]

చిక్కుల్లో చంద్ర‌బాబు!
X
ఓటుకు నోటు ఎర చూపిన కేసులో అస‌లు సూత్ర‌ధారి ఏపీ సీఎం చంద్ర‌బాబేన‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని బుధ‌వారం స్వ‌యంగా తెలంగాణ హోంమంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి ప్ర‌టించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం కార‌ణంగా మూడురోజుల నుంచి చంద్ర‌బాబు క‌ల‌త చెందార‌ని, స‌రిగా నిద్ర‌పోవ‌డం లేదంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు నాయిని ప్ర‌క‌ట‌న బ‌లం చేకూరుస్తుంది. అయితే సూత్ర‌ధారి ముఖ్య‌మంత్రి హోదాలో ఉండ‌టంతో ఇంత‌కాలం ప్ర‌క‌టించ‌డానికి స‌మ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అన్ని ఆధారాలు ప‌క్కాగా లేకుంటే ఇబ్బందులు వ‌స్తాయ‌న్న ఉద్దేశంతో వేచిచూసిన‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.
30 ఏళ్ల‌లో పెద్ద ఆప‌ద‌!
జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం ఆందోళ‌న‌క‌రంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. 20 ఏళ్ల క్రితం సొంత మామ ఎన్‌టీ రామారావును గ‌ద్దె దించి చంద్ర‌బాబు సీఎం కాగ‌లిగారు. అప్ప‌టి నుంచి 9ఏళ్ల‌కుపైగా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని పాలించారు. త‌రువాత 2004 ఎన్నిక‌ల‌కు ముందు పుట్టిన టీఆర్ ఎస్, 2009 ఎన్నిక‌ల ముందు ఆవిర్భ‌వించిన ప్ర‌జారాజ్యం పార్టీలు ఒక రకంగా టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నాయి. చివ‌రికి 2014 ఎన్నిక‌ల్లో కొత్త‌గా ఆవిర్భ‌వించిన వైఎస్ ఆర్‌సీపీ సైతం టీడీపీని ఇబ్బంది పెట్టింది. అయితే ఈసారి బాబు అన్ని అవాంత‌రాల‌ను అధిగ‌మించి ఏపీలో అధికారంలోకి రాగ‌లిగారు. 15 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భ‌వించింద‌ని తెలిసి అసెంబ్లీలో తెలంగాణ అన్న‌ ప‌దాన్ని నిషేధించారు చంద్రబాబు. ఆ ప‌దం ఆయ‌న్ని అంత‌గా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అదే పార్టీ తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అదే ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో చంద్ర‌బాబు చిక్కుకున్నారంటూ వార్త‌లురావ‌డం ఆయ‌న 30 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో అతిపెద్ద మ‌చ్చ‌గా మారింది. చంద్ర‌బాబును ఈకేసులో ముద్దాయిగా చేరిస్తే.. కేంద్రంలో ఆయ‌న ఇక చ‌క్రం తిప్పే అవ‌కాశాలు త‌గ్గుతాయి. న‌ల్ల‌ధ‌నం వెన‌క్కు తీసుకొస్తాం, ఏడాదిలో ఒక్క కుంభ‌కోణం కూడా జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకుంటున్న ఎన్డీఏకు టీడీపీతో దోస్తీ ఇబ్బందిక‌రంగా మార‌నుంది.ఇది పొత్తుపై కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని ఆస‌రాగా చేసుకుని మోదీపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌తిప‌క్షాల‌కు మోదీ ఆ అవ‌కాశం ఇవ్వ‌డంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు.
రేవంత్‌పై చ‌ర్య‌లేవి?
అవినీతిని స‌హించం అంటూ ప్ర‌తిజ్ఞ‌లు చేయిస్తున్న‌ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోవైపు ఆయ‌న పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు ఘ‌ట‌న‌లో సాక్ష్యాల‌తో ప‌ట్టుబ‌డినా ఎందుకు స్పందించ‌డం లేదు. రేవంత్‌రెడ్డిపై ఎందుకు వేటు వేయ‌డం లేదు.? అంటే తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న ఆ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉన్న‌ట్లే క‌నిపిస్తోందని వైఎస్సార్సీపీ, టీడీపీ వ్య‌తిరేక వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే చంద్ర‌బాబుకు రానున్న‌వి గ‌డ్డు రోజులే!
First Published:  3 Jun 2015 9:32 PM GMT
Next Story