Telugu Global
Others

భారత మార్కెట్లోకి మరో చైనా కంపెనీ

భారత మొబైల్‌ మార్కెట్లోకి మరో చైనా కంపెనీ ఫికామ్‌ ప్రవేశించింది. ఈ కంపెనీ తన 4జి మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర 10,999 రూపాయలు. జూన్‌9 నుంచి ఈ ఫోన్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ విడుదల సందర్భంగా ఫికామ్‌ సిఇఒ మిన్‌జెంగ్‌ మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లకాలంలో భారత్‌లో పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి), మార్కెటింగ్‌ కోసం 10 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. ఇక్కడే మొబైల్స్‌ను తయారు చేయాలన్న […]

భారత మొబైల్‌ మార్కెట్లోకి మరో చైనా కంపెనీ ఫికామ్‌ ప్రవేశించింది. ఈ కంపెనీ తన 4జి మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర 10,999 రూపాయలు. జూన్‌9 నుంచి ఈ ఫోన్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ విడుదల సందర్భంగా ఫికామ్‌ సిఇఒ మిన్‌జెంగ్‌ మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లకాలంలో భారత్‌లో పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి), మార్కెటింగ్‌ కోసం 10 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. ఇక్కడే మొబైల్స్‌ను తయారు చేయాలన్న ఆలోచన కూడా ఉందని, అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని తమ మొబైల్స్‌ను తెస్తామని, వచ్చే ఐదేళ్లకాలంలో భారత మార్కెట్లో 5 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు.
First Published:  3 Jun 2015 1:33 PM GMT
Next Story