Telugu Global
Cinema & Entertainment

వినోదం ఉంటే చాలు..

హీరో రామ్ , రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి చౌహ‌న్  లీడ్ రోల్స్ లో  డైరెక్ట‌ర్ గోపిచంద్  మ‌లినేని చేసిన సినిమా స‌క్సెస్ మీట్  జ‌రిగింది. ఈ  వేడుకలో హీరో రామ్ , హీరోయిన్స్, ద‌ర్శ‌క నిర్మాత‌లు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది. హీరో రామ్ ఈ సినిమాను మ‌న‌సు పెట్టి చేశామ‌న్నారు.  అయితే ఈ సినిమా ముందు  వ‌రుకు చేసిన‌వి అంత‌గా మ‌న‌సు ఎందుక పెట్టి చేయ‌లేదు ..అలా చేయ‌క పోవ‌డం వ‌ల్ల కెరీర్ లో […]

వినోదం ఉంటే చాలు..
X

హీరో రామ్ , రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి చౌహ‌న్ లీడ్ రోల్స్ లో డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని చేసిన సినిమా స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ వేడుకలో హీరో రామ్ , హీరోయిన్స్, ద‌ర్శ‌క నిర్మాత‌లు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది. హీరో రామ్ ఈ సినిమాను మ‌న‌సు పెట్టి చేశామ‌న్నారు. అయితే ఈ సినిమా ముందు వ‌రుకు చేసిన‌వి అంత‌గా మ‌న‌సు ఎందుక పెట్టి చేయ‌లేదు ..అలా చేయ‌క పోవ‌డం వ‌ల్ల కెరీర్ లో చాల న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది క‌దా అంటున్నారు ఆయ‌న అభిమానులు.
ఇక సినిమా గురించి దిల్ రాజ్ చెబుతు.. ఆరు , ఏడు సంవ‌త్స‌రాల క్రితం చెప్పిన పాయింట్. ఈ సినిమా క‌థ చెప్పిన త‌రువాత చాలా చిత్రాలు ఇదే త‌ర‌హాలో వ‌చ్చాయి. అయితే ఈ చిత్రంలో ఆద్యంతం వినోదం ఉండ‌ట‌మే రోటిన్ అయిన‌ప్ప‌టికి నిర్మాత‌ను ర‌క్షిస్తుంద‌ని అస‌లు నిజం చెప్పారు. ఇక గెస్ట్ గా వ‌చ్చిన వివి వినాయ‌క్ .. ద‌ర్శ‌కుడు గోపిచంద్ గురించి చెబుతూ.. వ‌ర‌స‌గా రెండు స‌క్సెస్ లు అందుకోవ‌డం అంటే తేలికైన విష‌యం కాద‌ని తేల్చారు. ఏతా వాత తెలిసిన నిజం ఏమిటి అంటే.. ఆడియ‌న్స్ సినిమా చూస్తున్నంత సేపు న‌వ్వించ గ‌లిగితే నిర్మాత సేఫ్ గా ఉన్న‌ట్లే మ‌రి.

First Published:  4 Jun 2015 12:31 AM GMT
Next Story