టాప్ టెన్ క్రిమిన‌ల్స్‌లో మోడి!

గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో ‘టాప్‌ 10 క్రిమినల్స్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఒక్క‌సారి క్లిక్ చేయండి. మీరు ఆశ్చ‌ర్య‌పోయే విష‌యం క‌నిపిస్తుంది… ఒక్కసారి ప్రయత్నించి చూడండి.. షాకవ‌డం ఖాయం. ఎందుకంటే.. గూగుల్‌ సెర్చ్‌లో ఇలా శోధిస్తే ప్రధాన మోడీ ఫొటోలు మొదటి వరుసలోనే మూడు కనిపిస్తాయి. ఇదేమిట‌నుకుని అనుకునేలోపే మ‌రొ కొన్ని చిత్రాలు మిమ్మ‌ల్ని మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయి. ఇందులో అర‌వింద్ కేజ్రివాల్‌, సోనాక్షి సిన్హా, మార్క్స్ వంటి వారు కూడా ఈ టాప్ టెన్ నేర‌స్థుల జాబితాలో క‌నిపిస్తారు. మోడీ త‌దిత‌రుల‌ని ఈ లిస్టులో కలపడం భారత వ్యతిరేకతకు, జాత్యహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు భార‌తీయులు. మోడీ వ్యతిరేకులు మాత్రం గుజరాత్‌ అల్లర్లను గుర్తు చేస్తూ మోడీని ఈ లిస్టులో చేర్చడం సమంజసమేనని సమర్థిస్తున్నారు. విచిత్రమేంటంటే..  మోడీని పదేపదే విమర్శించే కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా ఈ జాబితాలో మోడి ఉండ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తానేమీ మోడీ ఆరాధకుడిని కాకపోయినప్పటికీ ఆయన చిత్రాన్ని ఈ జాబితాలో చూడటం తనకు దిగ్ర్భాంతి కలిగించిందని ట్వీట్‌ చేశారు. అయితే చివరికి గూగుల్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పింది. సెర్చి ఆల్గారిథమ్స్‌ని మరింత మెరుగుపరిచేందుకు తమ సిబ్బంది పని చేస్తున్నారని, దీన్ని స‌రి చేస్తామ‌ని తెలిపింది.