Telugu Global
Cinema & Entertainment

విద్యాబాల‌న్ డాక్ట‌ర‌య్యింది...!

గౌర‌వంగా ఇచ్చే అవార్డులు .. నిజంగా గౌర‌వం పెంచుకునేలా ఉండాలి.  విద్యాబాల‌న్ కు గౌర‌వ డాక్ట‌రేట్  ఇవ్వ‌డం కూడా అటువంటిదే. అహ్మ‌దాబాద్ కు చెందిన రాయ్ యూనివ‌ర్సిటీ వారు  విద్యాబాల‌న్ భార‌తీయ సినిమాకు చేస్తున్న సేవ‌ల‌కుగాను ఈ అవార్డును ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. ఈ అవార్డు విద్యాబాల‌న్ కు రావ‌డం  నిజంగా ఇది  ఆ విశ్వ‌విద్యాల‌యం గౌర‌వాన్ని పేంచేది అని చెప్పాలి. న‌టిగా  డ‌ర్టీ పిక్చ‌ర్ త‌రువాత విద్యాబాల‌న్..చేస్తున్న చిత్రాలు  ప్రేక్ష‌కుల్ని ఆలోచింప‌చేసేవిగా ఉంటున్నాయి. అలాగే త‌ను ఆడ […]

విద్యాబాల‌న్ డాక్ట‌ర‌య్యింది...!
X

గౌర‌వంగా ఇచ్చే అవార్డులు .. నిజంగా గౌర‌వం పెంచుకునేలా ఉండాలి. విద్యాబాల‌న్ కు గౌర‌వ డాక్ట‌రేట్ ఇవ్వ‌డం కూడా అటువంటిదే. అహ్మ‌దాబాద్ కు చెందిన రాయ్ యూనివ‌ర్సిటీ వారు విద్యాబాల‌న్ భార‌తీయ సినిమాకు చేస్తున్న సేవ‌ల‌కుగాను ఈ అవార్డును ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. ఈ అవార్డు విద్యాబాల‌న్ కు రావ‌డం నిజంగా ఇది ఆ విశ్వ‌విద్యాల‌యం గౌర‌వాన్ని పేంచేది అని చెప్పాలి. న‌టిగా డ‌ర్టీ పిక్చ‌ర్ త‌రువాత విద్యాబాల‌న్..చేస్తున్న చిత్రాలు ప్రేక్ష‌కుల్ని ఆలోచింప‌చేసేవిగా ఉంటున్నాయి.

అలాగే త‌ను ఆడ వారికి మ‌రుగు దొడ్లు ఉండాల‌ని విద్యాబాల‌న్ చేసే వాణిజ్య ప్ర‌క‌ట‌న కూడా చాల గొప్ప విష‌యం అని చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్స్ ఎక్కువుగా త‌మ‌కు ఆదాయం వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌లు అవి చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. ఆదాయం లేక పోతే సింపుల్ గా నో చెబుతారు. కానీ విద్యాబాల‌న్ త‌న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకోకుండా అటువంటి ఒక ప్ర‌క‌ట‌న‌లో న‌టించ‌డం చాల గొప్ప విశేషం అంటారు ఆమే అభిమానులు.

First Published:  4 Jun 2015 12:11 AM GMT
Next Story