Telugu Global
Cinema & Entertainment

బాలు అంద‌రి వాడు

ఎర్రబస్సు రాని గ్రామం ఉంటుంది కానీ.. మ‌న బాల‌సుబ్రమ‌ణ్యం పాట చేర‌ని  ప్రాంతం తెలుగు నాట ఉండ‌దు . ఈ విష‌యంలో ఎవ‌రికి సందేహాం లేదు.  క‌ళాకారుడిగా ఆయ‌న ఒక చ‌ట్రంలో ఇమ‌డ లేదు.  పాట  ఏదైనా.. జీవం పోయ‌డం ఆయ‌న‌కు తెలుసు. శాస్త్రం కంటే..జ‌న‌రంజ‌కం గా ఉండ‌టానికే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు.  బాధ‌, విర‌హాం, ఆవేశం, రౌద్రం,  ఇలా న‌వ‌రసాలు ఆయ‌న గొంతు ద్వార ప‌ల‌క‌డానికి ఎప్పుడు పోటి ప‌డుతుంటాయి.  ఇక  ఈ టీవి ప్రారంభించిన పాడుతా […]

బాలు అంద‌రి వాడు
X
ఎర్రబస్సు రాని గ్రామం ఉంటుంది కానీ.. మ‌న బాల‌సుబ్రమ‌ణ్యం పాట చేర‌ని ప్రాంతం తెలుగు నాట ఉండ‌దు . ఈ విష‌యంలో ఎవ‌రికి సందేహాం లేదు. క‌ళాకారుడిగా ఆయ‌న ఒక చ‌ట్రంలో ఇమ‌డ లేదు. పాట ఏదైనా.. జీవం పోయ‌డం ఆయ‌న‌కు తెలుసు. శాస్త్రం కంటే..జ‌న‌రంజ‌కం గా ఉండ‌టానికే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. బాధ‌, విర‌హాం, ఆవేశం, రౌద్రం, ఇలా న‌వ‌రసాలు ఆయ‌న గొంతు ద్వార ప‌ల‌క‌డానికి ఎప్పుడు పోటి ప‌డుతుంటాయి. ఇక ఈ టీవి ప్రారంభించిన పాడుతా తీయ‌గా విజ‌య వంతంగా 19 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ప్ర‌పంచ టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో ఇదొక రికార్డు అన‌డం కూడా అతిశ‌యోక్తి కాదు.ఈ ప్రొగ్రామ్ ద్వారా ఎస్ పి బాల సుబ్ర‌మ‌ణ్యం ప్ర‌తి తెలుగు ఇంటి కుటుంబ స‌భ్యుడ‌య్యాడు. ఆయ‌న ఆయ‌న కాదు. బాలు మ‌న తెలుగు వారి సొత్తు. ప్ర‌తి కుటుంబానికి ఆయ‌న బంధువే. ఇటువంటి పుట్టిన రోజులు ఎన్నో జ‌రుపుకంటూ..సంగీత కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత సంతోషాన్ని ఇవ్వాల‌ని కోరుకుందాం.
First Published:  4 Jun 2015 1:21 AM GMT
Next Story