కమల్ హాసన్‌ని వెనుకకు తోసేసిన బాలివుడ్ హీరో

కమల్ హాసన్ లాంటి యూనివర్సల్ హీరో ఎక్కడ ఉన్నా గెలుస్తాడు అనిపించేటంత పేరు తెచ్చుకునాడు. యంగ్ హీరోలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి సతమతమవ్వుతుంటే, ఏకంగా మూడు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉంచుకోగలగడం ఒక రికార్డ్. అందులో ‘ఉత్తమ విలన్ ‘ ఆల్రెడీ రిలీజ్ అయింది. ‘విశ్వరూపం 2’ రిలీజ్ ఇంకా డోలాయమానంలో ఉంది. ఇక ‘పాప నాశం’ విడుదల డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది.

మలయాళం ‘దృశ్యం’ రీమేక్, కన్నడ, తెలుగులో సూపర్‌హిట్ అయ్యింది. తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్‌తో రీమేక్ అయ్యింది ‘దృశ్యం’. కాని అజయ్ దేవగన్ చిత్రం, ప్రమోషన్స్‌తో దూసుకుపోతుంది. కమల్ సినిమా పూర్తి అయ్యి చాన్నాళ్ళు అయినా, ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. తెలుగులో నదియా చేసిన క్యారెక్టర్‌లో మన తెలుగు అమ్మాయి టబు పవర్‌ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో ట్రెయిలర్స్‌లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ విషయంలో కమల్ హాసన్‌ని వెనుకకు తోసి ముందుగా తన రీమేక్‌ని అజయ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.