నేడు విడుద‌ల‌వుతున్న ఆంధ్రాపోరి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ఆంధ్రాపోరి. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. చిత్రం టైటిల్ ఆంధ్రాపోరి ని మార్చాల‌ని కొంద‌రు కోర్టుకు వెళ్లారు. ఇది ఆంధ్రా వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని కోర్టులో వాదించారు. కానీ, న్యాయ‌స్థానం వారి వాద‌న‌ను కొట్టిపారేసింది. దీంతో చిత్రం విడుద‌ల‌కు మార్గం సుగ‌మం అయింది. శుక్ర‌వారం రెండు రాష్ట్రాల్లోనూ చిత్రం విడుద‌ల‌కానుంది. దీంతో తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రో వార‌సుడు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు.