Telugu Global
Cinema & Entertainment

అసుర రివ్యూ

నారా రోహిత్ తన సినిమాలను ఎన్నుకోవడంలో ఇంతో అంతో భిన్నత్వం  ప్రదర్శిస్తాడు. ‘అసుర’ చిత్రం ద్వారా తనమీద వున్న నమ్మకాన్నికొనసాగించాడు. కథ కొత్త కేన్వాస్ మీదకు వెళ్ళినా, నడక మాత్రం రెగ్యులర్ తెలుగు సినిమాని దాటలేదు. పాటలు వుండాలి కాబట్టి వున్నాయి. వెంటాడేవాడే అసుర –వేటాడేవాడే అసుర అంటూ కీర్తిస్తాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న ఖైదీలను ఆరుకిలోమీటర్లు దాటకుండానే అడుగుముందుకు వేసి జైలరు ధర్మతేజ (నారా రోహిత్) హీరో అన్ని సినిమాల్లోలానే ఫైట్ చేసి […]

అసుర రివ్యూ
X

నారా రోహిత్ తన సినిమాలను ఎన్నుకోవడంలో ఇంతో అంతో భిన్నత్వం ప్రదర్శిస్తాడు. ‘అసుర’ చిత్రం ద్వారా తనమీద వున్న నమ్మకాన్నికొనసాగించాడు. కథ కొత్త కేన్వాస్ మీదకు వెళ్ళినా, నడక మాత్రం రెగ్యులర్ తెలుగు సినిమాని దాటలేదు. పాటలు వుండాలి కాబట్టి వున్నాయి. వెంటాడేవాడే అసుర –వేటాడేవాడే అసుర అంటూ కీర్తిస్తాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న ఖైదీలను ఆరుకిలోమీటర్లు దాటకుండానే అడుగుముందుకు వేసి జైలరు ధర్మతేజ (నారా రోహిత్) హీరో అన్ని సినిమాల్లోలానే ఫైట్ చేసి పట్టుకొని, ఓ పాటకూడా పాడుకోవడంతో కథ రొటీన్ గా మొదలవుతుంది. రొటీన్ గా చిన్నప్పుడే ధర్మ తలిదండ్రుల్ని చంపేసివున్న నేపథ్యం.. స్వభావంలో కోపం భాగమవుతుంది. ఉద్యోగంలోనూ రక్షకుడిగా కాక రాక్షసుడుగా పేరు సంపాదిస్తాడు. రూల్స్ కన్నా రిజల్సే ముఖ్యం అనుకుంటాడు. మధ్య మధ్యలో ప్రేయసి(ప్రియ బెనర్జీ)ని ఎమోషన్స్ లేకుండా ప్రేమిస్తుంటాడు. జైలుకి చంద్రశేఖర్ అలియాస్ చార్లీ(రవి వర్మ) అనే కొత్త ఖైదీ వస్తాడు. సంపన్నుడైన దిలీప్ కొఠారికి మొదటి భార్యకొడుకు. తండ్రి చనిపోవడంతో రెండవభార్య భారతీదేవి(రూపాదేవి) ని చేరువకానివ్వకపోగా ఆమె ముగ్గురుపిల్లల్ని చంపేస్తాడు. చార్లీకి పడ్డ ఉరిశిక్షకు క్షమాభిక్ష దొరకదు. ఎలాగైనా జైలునుండి తప్పించుకోవాలని మరో ఖైదీ పాండూ సహాయంతో బయటవున్న ముత్యంనాయుడు, దయ గ్యాంగ్ తో సంబంధం పెట్టుకుంటాడు. ఇక తలారీ తల్లిని, మేజిస్ట్రేట్ కొడుకుని, ధర్మ ప్రేయసిని కిడ్నాప్ చేయడంతో తలారీ వురి తప్పించడంతో పై అధికారుల్నుండి ఒత్తిడి ఎదుర్కున్న ధర్మాని విధులనుండి మార్చేస్తారు. రెండుసార్లు వురి వాయిదాపడ్డంతో రాజమండ్రి జైలు నుండి విశాఖపట్నం జైలుకు చార్లీని తరలిస్తూ వుండగా ముత్యంనాయుడు, దయ ఎటాక్ చేస్తారు. దయాని చంపి చార్లీ తప్పించుకోగా ముత్యంనాయుడు ధర్మచేతిలో చనిపోతాడు. యిది పైకి కనిపించే కథ! అసలుకథ ధర్మ ఇంటలిజెన్స్ తో నడిపించి రక్తి కట్టిస్తాడు. రివీలైన అసలు కథ తెరమీద చూడాల్సిందే!

హీరో అన్నాక హీరోయిన్ని ప్రేమించక తప్పదన్నట్టు ప్రేమిస్తాడు హీరో. వారిమధ్య రిలేషన్ డ్రై గా వుండి కథని నీరస పరుస్తుంది. చూసేవాళ్ళని నిరాశ పరుస్తుంది. నారా రోహిత్ నటన ఎప్పటిలాగే వుంది. ప్రియా బెనర్జీకి అవకాశం లేదు. సినిమాని నెమ్మదిగానడిపినా క్లయిమాక్స్ వేగం అందుకోవడంలో రచన దర్శకత్వం వహించిన క్రిష్ణవిజయ్ పర్వాలేదనిపించాడు. మ్యూజిక్ కెమెరా అంతంతమాత్రంగానే వున్నాయి.

రేటింగ్: 3/5

First Published:  5 Jun 2015 4:38 AM GMT
Next Story