Telugu Global
NEWS

అన్నవరంలో భక్తులపై క్యాంటీన్‌ నిర్వాహకుల దాడి

తూర్పుగోదావ‌రి జిల్లాలోని అన్నవరం కొండపై ప్రైవేటు క్యాంటీన్‌ నిర్వాహకులు భక్తులపై దాడి చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన 20 మంది భక్తుల బృందం అన్నవరం చేరుకున్నారు. దర్శనానంతరం క్యాంటీన్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లగా అక్కడ సర్వీస్‌ బాగోకపోవడంతోపాటు, టోకెన్‌ల ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత కూడా టిఫిన్‌ సరఫరా చేయడం, ఆహారం సరిగ్గా లేకపోవడంపై భక్తులు క్యాంటీన్‌ నిర్వాహకులను నిలదీశారు. దీంతో భక్తులతో దురుసుగా ప్రవర్తించిన స్థానికులైన ప్రైవేటు క్యాంటీన్‌ నిర్వాహకులు వారిపై దాడికి తెగబడ్డారు. ఈ […]

అన్నవరంలో భక్తులపై క్యాంటీన్‌ నిర్వాహకుల దాడి
X
తూర్పుగోదావ‌రి జిల్లాలోని అన్నవరం కొండపై ప్రైవేటు క్యాంటీన్‌ నిర్వాహకులు భక్తులపై దాడి చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన 20 మంది భక్తుల బృందం అన్నవరం చేరుకున్నారు. దర్శనానంతరం క్యాంటీన్‌లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లగా అక్కడ సర్వీస్‌ బాగోకపోవడంతోపాటు, టోకెన్‌ల ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత కూడా టిఫిన్‌ సరఫరా చేయడం, ఆహారం సరిగ్గా లేకపోవడంపై భక్తులు క్యాంటీన్‌ నిర్వాహకులను నిలదీశారు. దీంతో భక్తులతో దురుసుగా ప్రవర్తించిన స్థానికులైన ప్రైవేటు క్యాంటీన్‌ నిర్వాహకులు వారిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పది మంది భ‌క్తుల‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
క్యాంటిన్ మూత‌కు మంత్రి ఆదేశాలు
ఈ సంఘ‌ట‌న‌పై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల‌రావు సీరియ‌స్ అయ్యారు. భ‌క్తుల‌పై క్యాంటిన్ నిర్వాహ‌కులు దాడి చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మ‌స్య ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల‌ని, భ‌క్తుల‌కు స‌ర్ధి చెప్పాల్సింది పోయి ఆహారం బాగోలేదంటే దాడి చేస్తారా అని ప్ర‌శ్నించారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించారు. నివేదిక వ‌చ్చే వ‌ర‌కు క్యాంటిన్ మూసి వేయాల‌ని ఆదేశించారు.
First Published:  5 Jun 2015 4:52 AM GMT
Next Story