చిరు పిలుపు కోసం ప్రభుదేవా ఎదురుచూపులు!

ఎవరైనా..ఎపుడైనా…నీ ఫేవరెట్ డ్యాన్సర్స్ ఎవరూ అని ప్రభుదేవాని ప్రశ్నిస్తే, అతను టక్కున చెప్పే సమాధానం ఎప్పుడూ ఒక్కటే. హీరోస్‌లో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్స్‌లో అందాల అతిలోక సుందరి శ్రీదేవి. ఇప్పుడైతే మనోడు బాలివుడ్ చెక్కేసి, హిట్ చిత్రాలు రీమేక్ చేసి, కొన్ని మంచి హిట్స్… ఇంకొన్ని సూపర్ ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం మరో క్రేజీ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ దర్శకత్వంలో వస్తున్న ‘ABCD 2’ లో కీలకమైన డ్యాన్స్ మాస్టర్ పాత్రతో బాలివుడ్ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. 
మరిక డ్యాన్స్ డైరెక్షన్‌కి ఫుల్‌స్టాప్ పెట్టినట్లేనా?అని ప్రశ్నిస్తే కాదనే అంటున్నాడు ప్రభుదేవా. ఇప్పుడు తన ఫేవరెట్ డ్యాన్సర్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేస్తున్నాడు కదా! ఆ సినిమాలో తనకు కూడా కొరియోగ్రాఫర్‌గా చిరు చాన్స్ ఇస్తాడని, ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని తన మనసులో మాట బయట పెట్టేసాడు. డ్యాన్స్ అంటే సగటు తెలుగు ప్రేక్షకుడికీ ఇప్పటికీ గుర్తుకు వచ్చేది చిరంజీవినే. మరి ప్రభు ఆశ తీరుతుందేమో చూడాలి..