Telugu Global
NEWS

రేవంత్ బెయిల్‌పై 9న మ‌ళ్ళీ విచార‌ణ‌

తెలంగాణ తెలుగుదేశం నాయ‌కుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై ఈనెల 9వ తేదీన విచారణ జరగనుంది. బెయిల్ పిటిష‌న్‌పై 8వ తేదీన ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. నోటుకు ఓటు కేసులో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు రేవంత్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన్ని ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. దాంతో […]

రేవంత్ బెయిల్‌పై 9న మ‌ళ్ళీ విచార‌ణ‌
X
తెలంగాణ తెలుగుదేశం నాయ‌కుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై ఈనెల 9వ తేదీన విచారణ జరగనుంది. బెయిల్ పిటిష‌న్‌పై 8వ తేదీన ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. నోటుకు ఓటు కేసులో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు రేవంత్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన్ని ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. దాంతో రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసు విచార‌ణ స‌మ‌యంలో శుక్ర‌వారం ఆయనను అయిదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో రూ.50 లక్షలు మాత్రమే పట్టుబడ్డాయని, ఈ డబ్బులు ఎవరు సమకూర్చారో తెలుసుకోవాల్సి ఉందని, కాల్ డేటాను విశ్లేషించాల్సి ఉందని, ఎవరెవరితో సంప్రదింపులు జరిపారో అనే దానితోపాటు ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సి ఉందని అందుకే రేవంత్ రెడ్డిని కస్టడీకి కోరుతున్నట్లు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ కేసులో రేవంత్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపిస్తూ రేవంత్‌ను కస్టడీకి ఇస్తే అతని ప్రాణానికి ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. రేవంత్ రెడ్డిని ఇరికించ‌డానికి గంట ముందే కేసీఆర్ దీనిపై వ్యాఖ్యానించారని, పైగా ఎమ్మెల్యే స్టీవెన్ సన్ ఇంట్లో ఉదయం నుంచే ఆ రూ. 50 ల‌క్ష‌ల డబ్బు ఉందని రేవంత్ న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాకుండా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. టీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి అని, ఆయనను పథకం ప్రకారమే ఈ కేసులో ఇరికించారని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజే కస్టడీ ఎందుకు అడగలేదని, మే 28నే ముందస్తు సమాచారం ఉన్నప్పుడు మే 31 వరకూ ఎందుకు వేచి ఉన్నారని, వీడియో రికార్డింగ్ కోసం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అనుమతి తీసుకున్నారా?, ఎవరో పెద్ద వ్యక్తిని కేసులో ఇరికించడానికే కస్టడీ కోరుతున్నారని రేవంత్ తరపు న్యాయవాదులు ఆరోపించారు.
First Published:  5 Jun 2015 3:45 AM GMT
Next Story