చూడటానికి బ్రెయిన్ అవసరంలేని సినిమా!

తమ తమ సినిమాలను ప్రమోట్ చేస్కోవ‌డానికి, చిత్ర యూనిట్ రకరకాల స్ట్రాటజీలు తయారు చేసుకోవడం సర్వ సాధారణం. కాని తమ సినిమాను చూడటానికి బ్రెయిన్ అవసరం లేదని స్వయంగా ఆ చిత్ర నిర్మాతే చెప్పడం  వింతగా అనిపించవచ్చు. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ‘సింగం 123’ మూవీ నిర్మాత అదే వక్కాణించి మరీ చెపుతున్నాడు. తెరపై మా సినిమాను చూస్తూ నవ్వుకోవాలంటే, బ్రెయిన్స్ వాడకూడదు అని గమనిక కూడా వుంది మరి.
‘సింగం 123’ ట్రెయిలర్స్ మరియు ఇతర ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అదే అర్థం అవుతుంది. ఈ శుక్రవారం ‘సింగం 123’ కామెడీతో సంపూర్నేష్ బాబు మరొక సారి స్పూఫ్ తరహా కామెడీతో అలరించబోతున్నాడు. స్పూఫ్ కామెడీతో ఒక పవర్‌ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్ర చేయడం ఒక వెరైటీ అయితే అందులో మాఫియా డాన్‌లను ఎదుర్కోవడం ఫుల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇస్తుందని ఒక అంచనా సినిమా సర్కిల్స్‌లో. మరి సంపూ ఎంతవరకు అలరిస్తాడో కొద్ది సేపట్లో తేలిపోతుంది.