Telugu Global
NEWS

రేవంత్‌రెడ్డి తొలిరోజు కస్టడీ ముగిసింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు రేవంత్‌ను గంటన్నరపాటు ప్రశ్నించారు. ఉదయం నుంచి కస్టడీపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా చివరికి మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి రేవంత్‌ను ప్రశ్నించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. నిజానికి రేవంత్‌ను ఉద‌యం 9 గంట‌ల‌కే ఎసీబీ త‌న అధీనంలోకి తీసుకుని ప్ర‌శ్నించాల్సి ఉంది. కాని మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆయ‌న్ని జైలు నుంచి త‌ర‌లించ‌లేదు. ఈ విష‌య‌మై ఎసీబీ […]

రేవంత్‌రెడ్డి తొలిరోజు కస్టడీ ముగిసింది.
X
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు రేవంత్‌ను గంటన్నరపాటు ప్రశ్నించారు. ఉదయం నుంచి కస్టడీపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా చివరికి మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి రేవంత్‌ను ప్రశ్నించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. నిజానికి రేవంత్‌ను ఉద‌యం 9 గంట‌ల‌కే ఎసీబీ త‌న అధీనంలోకి తీసుకుని ప్ర‌శ్నించాల్సి ఉంది. కాని మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆయ‌న్ని జైలు నుంచి త‌ర‌లించ‌లేదు. ఈ విష‌య‌మై ఎసీబీ అధికారుల‌పై రేవంత్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ్డారు. రేవంత్ మూమెంట్స్ త‌మ‌కు తెలియ‌కుండా ఎసీబీ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, త‌మ స‌మ‌క్షంలో విచార‌ణ జ‌ర‌గాల‌న్న కోర్టు ఆదేశాల‌ను ఇది ధిక్క‌రించ‌మే అవుతుంద‌ని అంటూ ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ఆరోపించారు. త‌మ వాద‌న‌ను న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే మ‌ధ్యాహ్నం నాటికి క‌థ సుఖాంత‌మై రేవంత్‌ను తీసుకెళ్ళి సాయంత్రానికి మ‌ళ్ళీ చ‌ర్లప‌ల్లి జైలుకు అప్ప‌గించారు.
First Published:  6 Jun 2015 7:22 AM GMT
Next Story