Telugu Global
Cinema & Entertainment

సినీ హీరోయిన్‌ ఆర్తి అగ‌ర్వాల్ హ‌ఠాన్మ‌ర‌ణం!

అందాల సినీ హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ (31) అనూహ్యంగా కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు అమెరికాలో లైపో స‌క్ష‌న్ స‌ర్జ‌రీ జ‌రిగింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ విక‌టించి అనూహ్యంగా మృతి చెందారు కొద్దిరోజులుగా స్థూల‌కాయం, శ్వాస‌కోస సంబంధ వ్యాధుల‌తో ఆమె బాధ‌ప‌డుతున్నారు. 2001లో తొలి తెలుగు చిత్రం ‘నువ్వునాకు న‌చ్చావ్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఆర్తి మొద‌టి చిత్రంతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఇంద్ర సినిమాతో ఆమె స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. 2001 నుంచి 2005 […]

సినీ హీరోయిన్‌ ఆర్తి అగ‌ర్వాల్ హ‌ఠాన్మ‌ర‌ణం!
X
అందాల సినీ హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ (31) అనూహ్యంగా కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు అమెరికాలో లైపో స‌క్ష‌న్ స‌ర్జ‌రీ జ‌రిగింది. రెండు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ విక‌టించి అనూహ్యంగా మృతి చెందారు కొద్దిరోజులుగా స్థూల‌కాయం, శ్వాస‌కోస సంబంధ వ్యాధుల‌తో ఆమె బాధ‌ప‌డుతున్నారు. 2001లో తొలి తెలుగు చిత్రం ‘నువ్వునాకు న‌చ్చావ్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఆర్తి మొద‌టి చిత్రంతోనే మంచి పేరు సంపాదించుకుంది. ఇంద్ర సినిమాతో ఆమె స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. 2001 నుంచి 2005 వరకు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల హీరోయిన్‌ దాదాపు ఆమె ఇర‌వై ఒక్క చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. తెలుగు చిత్ర రంగంలో సినీ అగ్ర హీరోలంద‌రితో ఆర్తి అగ‌ర్వాల్ న‌టించారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, నాగార్జున‌, మ‌హేశ్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, త‌రుణ్‌లతో అమె న‌టించారు. నువ్వు లేక నేను లేను, ఇంద్ర‌, అడ‌విరాముడు, ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు, వీడే, బాబీ, నీ స్నేహం, వ‌సంతం, సంక్రాంతి, గంగోత్రి, అందాలరాముడు, గోరింటాకు, అల్ల‌రి రాముడు వంటి అనేక సూప‌ర్ హిట్ సినిమాల్లో ఆర్తి హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. పెళ్ల‌యిన త‌ర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా సునీల్‌ హీరోగా విడుదలయిన అందాల‌రాముడు చిత్రంతో మ‌రోసారి వెండి తెర‌పై కనిపించారు. ఒక యువ హీరోతో ప్రేమ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో మ‌న‌స్తాపం చెందిన ఆమె 2005లో ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత మ‌రోసారి మెట్ల మీద నుంచి జారిప‌డిన‌ట్టు చెప్పిన మ‌రో సంఘ‌ట‌న‌లో కూడా ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. 2007లో గుజ‌రాతీ ప్ర‌వాస భార‌తీయుడు ఉజ్వల్‌తో ఆమె వివాహం జ‌రిగింది. వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ళకే ఆమె విడాకులు తీసుకున్నారు. త‌ల్లిదండ్రుల‌తో న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీలో ఉంటున్న ఆర్తి చివ‌రి సినిమా ర‌ణం-2. అయితే చివరి సినిమా నీలవేణి అని కొందరు, జెంటిల్‌మెన్‌ అని ఇంకొందరంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. 1984 మే 5వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించిన ఆమె అకాల మ‌ర‌ణంతో అభిమానులు, తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ దిగ్ర్బాంతికి గురైంది.
First Published:  6 Jun 2015 4:27 AM GMT
Next Story