మహేష్ బాహుబలిని ఎలా ఢీకొంటాడు?

‘బాహుబలి’ జూలై 10న వచ్చేస్తునాడని రాజమౌలి తమిళ్ ట్రెయిలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో ప్రకటించేశాడు. మహేష్ సినిమా ‘శ్రీమంతుడు’ కూడా ఒక వారం తేడాలో జూలై 17న వస్తుందని ఆ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసేసారు. అంతా బాగానే ఉంది. మరి ఈ రెండు సినిమాలు అనుకున్న ప్రకారం వస్తాయా అసలు?

‘బాహుబలి’ విషయానికి వస్తే, ఆడియోనే రెండు రోజుల ముందు పోస్ట్‌పోన్ చేసిన వాళ్ళు, రిలీజ్ చెప్పిన డేట్‌కి చెయ్యగలరా? ‘శ్రీమంతుడు’ విషయానికి వస్తే, అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా 12 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. అది పూర్తయితే గాని ..ఆడియో సంగతి తేలదు.  మరి అటువంటప్పుడు,  అనుకున్న ప్రకారం, జూలై 17 న మహేష్ ‘శ్రీమంతుడు’ గా రాగలడా? రెండు పెద్ద సినిమాలు ఒక వారం వ్యవధిలో ఢీకొంటే సినిమాల బిజినెస్ పరంగా అంత మంచిది కాదు కదా! మరి ‘బాహుబలి’ తో మహేష్ సై అంటాడా, లేదా పోస్ట్‌పోన్ చేసుకుంటాడా వేచి చూడవలసిందే సుమా!