Telugu Global
International

బంగ్లాలో మోడీకి ఘ‌న‌స్వాగ‌తం

భారత ప్రధాని నరేంద్ర మోడి శనివారం బంగ్లాదేశ్‌ చేరుకున్నారు. బంగ్లా ప్రధాని షేక్‌హసీనా స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని  మోడికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే భారత ప్రధాన మంత్రికి బంగ్లాదేశ్‌ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. తర్వాత ప్రధాని  మోడి బంగ్లాదేశ్‌ జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించారు. 1971 బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో అమరులైన సైనికులకు  మోడి నివాళులర్పించారు. నాటి యుద్ధం సమయానికి పాకిస్థాన్‌లో భాగంగా ఉన్న తూర్పు బెంగాల్‌ ప్రాంతం విముక్తికి భారత సైన్యం సహాయం […]

బంగ్లాలో మోడీకి ఘ‌న‌స్వాగ‌తం
X
భారత ప్రధాని నరేంద్ర మోడి శనివారం బంగ్లాదేశ్‌ చేరుకున్నారు. బంగ్లా ప్రధాని షేక్‌హసీనా స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోడికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే భారత ప్రధాన మంత్రికి బంగ్లాదేశ్‌ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. తర్వాత ప్రధాని మోడి బంగ్లాదేశ్‌ జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించారు. 1971 బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో అమరులైన సైనికులకు మోడి నివాళులర్పించారు. నాటి యుద్ధం సమయానికి పాకిస్థాన్‌లో భాగంగా ఉన్న తూర్పు బెంగాల్‌ ప్రాంతం విముక్తికి భారత సైన్యం సహాయం అందించింది. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పంపించిన భారత సైన్యాలు బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో కీలక భూమిక వహించాయి. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు మోడి నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శుక్రవారం నాడే ఢాకా చేరుకున్నారు. మోడి పర్యటనలో భాగంగా భారత్‌- బంగ్లాదేశ్‌లు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. బెంగాల్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దులోని ప్రాంతాలను పరస్పర మార్పులు చేసుకోవడానికి ఆ ఒప్పందం వీలు కల్పిస్తుంది. రెండు దేశాల మధ్య నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న ఆ సమస్యకు ఈ ఒప్పందంతో పరిష్కారం లభిస్తుంది. దాని కోసమే మమతాబెనర్జీ బంగ్లాదేశ్‌ చేరుకున్నారు.
First Published:  6 Jun 2015 6:02 AM GMT
Next Story