స‌హ‌జీవ‌నం త‌ప్పేంట‌న్న‌ నిత్య‌మీన‌న్

సహజీవనం కాన్సెప్ట్ ఆధారంగా ఇటీవలే తెరకెక్కిన ఓ మూవీలో నటించిన నిత్యా మీన‌న్ ఈ కాన్సెప్ట్‌కు మ‌ద్ద‌తుగా తెగ లెక్చర్లు దంచేస్తోంది. తన సినిమా రిలీజ్ టైంలో ఈ హాట్ మ్యాటర్ ను సపోర్ట్ చేసేలా మాట్లాడి జనాలకు షాకిచ్చిన ఈ కేర‌ళ‌ బ్యూటీ.. తాజాగా మళ్లీ అవే ప‌లుకులు ప‌లుకుతోంది. అయితే ఈసారి ఇంకాస్త కొత్తగా.. మరింత లోతుగా. సహజీవనం తప్పనే భావన మనలో ఉంది కానీ.. దాని వల్ల మంచే జరుగుతుందని అంటోంది నిత్యామీనన్. ముక్కూ మోహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సర్దుకుపోయే బదులు.. నచ్చిన వాడితో హాయిగా సహజీవనం చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తోందీ పొట్టి సుంద‌రి. ‘లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకునే వీలు ఉంటుంది. అరెంజ్డ్ మ్యారేజెస్ లో ఆ ఛాన్స్ ఉండదు. అందుకే నా మద్దతు దానికే’ అంటోంది నిత్యా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. తనకు నచ్చింది చేసుకుపోయే నిత్యా.. మరి ఈ సహ జీవనం విషయాన్ని మాటలకే పరిమితం చేస్తుందో లేక.. చేతల్లోనూ చూపిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ!