Telugu Global
Others

బంగ్లాతో ఒప్పందం చారిత్రాత్మ‌కం: మోడీ

భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న మోడీ ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ఒప్పందాలు చేసుకున్నామని, ఇవి రెండు దేశాల అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఒప్పందాలన్నింటిలో సరిహద్దు ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు. భారత్‌ది విస్తరణ వాదం కాదని, అభివృద్ధి వాదమేనన్న ప్రధాని […]

బంగ్లాతో ఒప్పందం చారిత్రాత్మ‌కం: మోడీ
X

భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న మోడీ ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ఒప్పందాలు చేసుకున్నామని, ఇవి రెండు దేశాల అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఒప్పందాలన్నింటిలో సరిహద్దు ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు. భారత్‌ది విస్తరణ వాదం కాదని, అభివృద్ధి వాదమేనన్న ప్రధాని మోదీ పరోక్షంగా చైనాకు చురకలంటించారు.

First Published:  7 Jun 2015 10:17 AM GMT
Next Story