60ఏళ్ల అవ్వగా ఐష్

రీఎంట్రీ తర్వాత ప్రయోగాలకే సిద్ధమైంది ఐశ్వర్యరాయ్. బాలీవుడ్ లో ఇప్పుడున్న కత్రినాకైఫ్, దీపికా పదుకోన్, అలియా భట్ లాంటి అందాల సెగ నుంచి తప్పించుకోవాలంటే అందంకంటే నటనపైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది ఐష్. అందుకే రీఎంట్రీలో అలాంటి పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే జాజ్బా లాంటి ప్రయోగాత్మక చిత్రం చేస్తున్న ఐశ్వర్యరాయ్, తాజాగా మరో ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఒప్పుకుంది. పాకిస్థాన్ జైలులో చనిపోయిన సరబ్ జిత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో నటించేందుకు ఒప్పుకుంది. సినిమా ప్రయోగాత్మకమైతే అందులో ఐష్ పాత్ర మరింత ప్రయోగాత్మకం. అవును.. ఇందులో ఐశ్వర్యరాయ్ 61ఏళ్ల ముసలి పాత్రలో కనిపించబోతోంది. ఈ క్యారెక్టర్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్న ఐష్ ఇప్పట్నుంచే ఆ దిశగా హోంవర్క్ ప్రారంభించింది. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇన్నాళ్లూ అందానికి చిరునామాలా ఐష్ ను చూసిన ఆలిండియా జనాలు, కొత్త పాత్రల్లో ఆమెను యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.