Telugu Global
Others

స‌కుటుంబ స‌మేతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన బొత్స‌

పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం లోటస్‌ పాండ్‌ కార్యాలయానికి చేరుకున్న బొత్సను వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బొత్సతోపాటు ఆయన సతీమణి, మాజీ కాంగ్రెస్‌ ఎంపీ బొత్స ఝాన్సీ, కుటుంబ సభ్యులు బొత్స అప్పల నర్సయ్య, అప్పలనాయుడు సహా విజయ నగరం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బొత్సతో పాటుగా వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బొత్స […]

స‌కుటుంబ స‌మేతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన బొత్స‌
X

పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం లోటస్‌ పాండ్‌ కార్యాలయానికి చేరుకున్న బొత్సను వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బొత్సతోపాటు ఆయన సతీమణి, మాజీ కాంగ్రెస్‌ ఎంపీ బొత్స ఝాన్సీ, కుటుంబ సభ్యులు బొత్స అప్పల నర్సయ్య, అప్పలనాయుడు సహా విజయ నగరం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బొత్సతో పాటుగా వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి నాయత్వంలో తాను పని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే తామంతా వైసీపీలో చేరామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి అయిందని, ఎన్నికల ముందు రాష్ట్రంలో పరిస్థితులు అందరికి తెలుసునని, క‌ల్ల‌బొల్లి హామీలిచ్చి అధికారం చేపట్టిన‌ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరికి వ్యతిరేకంగా పోరాడేందుకు, బాధ్యతగల పౌరుడుగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. “చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, కాంగ్రెస్లో ఉండి పోరాడలేమనే.. వైఎస్ఆర్సీపీలో చేరానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేయలేదని, ఆ పార్టీలో వివిధ పదవులు అనుభవించానని, త‌న రాజకీయ అనుభవమంతా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఉప‌యోగిస్తాన‌ని ఆయ‌న అన్నారు. తాను పదవుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర సమస్యలు త‌న‌కు తెలుసునని, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకుడినని, జగన్‌కు అండగా ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని బొత్స సత్యనారాయణ సష్టం చేశారు. స్వార్థం కోసం వైసీపీలో చేరలేదని, పేద, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం పార్టీలో చేరానని బొత్స వ్యాఖ్యానించారు. రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.9 వేల కోట్లు కేటాయించి.. రూ.24 వేల కోట్ల మాఫీ చేశామని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు పథకాలు చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వాణ్ని. అభివృద్ధిని ఒకేచోటే కేంద్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్సార్సీపీనే. విజయనగరంలోని కాంగ్రెస్ కేడర్ అంతా వైఎస్సార్సీపీలో చేరినట్టే” అని బొత్స మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేస్తామని బొత్స ఝాన్సీ అన్నారు.

First Published:  7 Jun 2015 1:55 AM GMT
Next Story