ఆర్తిని గుర్తుచేసుకున్న చార్మి

హఠాత్తుగా కన్నుమూసిన ఆర్తి అగర్వాల్ జ్ఞాపకాలు టాలీవుడ్ ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సురేష్ బాబు నుంచి తోటి హీరోయిన్ల వరకు అంతా ఆర్తి అగర్వాల్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చార్మి కూడా చేరింది. తనకు ఆర్తితో పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ.. తామిద్దరి మధ్య అపార్ట్ మెంట్ రిలేషన్ ఉందని చెప్పుకొచ్చింది చార్మి. కెరీర్ స్టార్టింగ్ లో తను ఉన్న సూట్ రూమ్ లోనే తర్వాత ఆర్తి అగర్వాల్ దిగిందని చెప్పుకొచ్చింది చార్మి. అదే సూట్ రూమ్ లో ఆర్తి దాదాపు మూడేళ్ల పాటు ఉండి స్టార్ హీరోయిన్ అయిందని గుర్తుచేసింది. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడు అదే విషయాన్ని ఆర్తికి కూడా చెప్పానని, అలా ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని గుర్తుచేసుకుంది. ఆర్తి హఠాన్మరణం తనను కలచివేసిందని చెప్పుకొచ్చింది.