Telugu Global
International

బంగ్లాతో భూసరిహద్దు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

ఎట్ట‌కేల‌కు భారత్‌, బంగ్లాదేశ్‌ నడుమ 4096 కిలోమీటర్ల సుదీర్ఘ భూసరిహద్దుకు ప‌రిష్కారం ల‌భించింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావ సమయంలో భారత్‌కు చెందిన కొన్ని భూభాగాలు బంగ్లాదేశ్‌లోను, ఆ దేశానికి చెందిన కొన్ని భూభాగాలు భారత్‌లోను ఉండిపోయాయి. వీటిని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు 1974లో ఇరుదేశాల నడుమ భూసరిహద్దు ఒప్పదం కుదిరినా ఇంత‌వ‌ర‌కు ప‌రిష్కారం కాలేదు. ఎట్టకేలకు సుదీర్ఘ సమస్యకు మోడీ హయాంలో పరిష్కారం లభించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌ భూభాగంలో ఉన్న 111 ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు బదిలీ […]

బంగ్లాతో భూసరిహద్దు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం
X
ఎట్ట‌కేల‌కు భారత్‌, బంగ్లాదేశ్‌ నడుమ 4096 కిలోమీటర్ల సుదీర్ఘ భూసరిహద్దుకు ప‌రిష్కారం ల‌భించింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావ సమయంలో భారత్‌కు చెందిన కొన్ని భూభాగాలు బంగ్లాదేశ్‌లోను, ఆ దేశానికి చెందిన కొన్ని భూభాగాలు భారత్‌లోను ఉండిపోయాయి. వీటిని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు 1974లో ఇరుదేశాల నడుమ భూసరిహద్దు ఒప్పదం కుదిరినా ఇంత‌వ‌ర‌కు ప‌రిష్కారం కాలేదు. ఎట్టకేలకు సుదీర్ఘ సమస్యకు మోడీ హయాంలో పరిష్కారం లభించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌ భూభాగంలో ఉన్న 111 ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు బదిలీ చేస్తారు. ప్రతిగా బంగ్లాదేశ్‌లో ఉన్న 51 భారత్‌ భూభాగాలను ఆ దేశం భారత్‌కు బదిలీ చేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ప్రశ్నార్థకంగా మారిన 50వేల మంది పౌరసత్వానికి తాజా ఒప్పందంతో పరిష్కారం లభించనుంది. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దులో ఉన్న 510 ఎకరాలు భారతదేశ నియంత్రణలో, 10వేల ఎకరాలు బంగ్లాదేశ్‌ నియంత్రణలో ఉంటాయి.
First Published:  7 Jun 2015 2:07 AM GMT
Next Story