మెగాహీరో పైన టైటిల్స్ వర్షం కురుస్తోంది

మెగా హీరో సినిమాలకి టైటిల్స్ పెట్టడం అంత ఆషామాషి కాదు. అభిమానులను సంతృప్తి పరిచేలా ఉండాలి, మెగాఫ్యామిలీ స్థాయికి తగ్గట్లు పవర్‌ఫుల్‌గా ఉండాలి. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాపై అందరికీ కుతూహలం ఉండడం సహజం. శ్రీనువైట్లతో రామ్ చరణ్ సినిమా అంటే ..కొంచెం డిఫరెంటే.. ఇది వారి మొదటి కాంబినేషన్ గనుక.

ఇక మొదటి నుండి… ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. కాని క్రమంగా, ఈ సినిమాలో రామ్ చరణ్ సినిమాలో ఫైట్ మాస్టర్ రోల్ చేస్తునాడు గనుక, ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ పరిగణలోకి వచ్చిందని టాక్ వచ్చింది. లేటెస్ట్‌గా మాత్రం ‘సుప్రీం’ అనే టైటిల్ ఉండొచ్చని, పైగా ఒకప్పుడు..ఇది మెగాస్టార్ చిరంజీవి టైటిల్ కనుక, మెగా ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని, ఇదే పేరు రామ్ చరణ్ సినిమాకి కన్‌ఫర్మ్ అని అంటున్నారు. ఏది ఏమైనా, అఫీషియల్‌గా ప్రకటించేవరకూ..ఏదీ కన్‌ఫర్మ్ అనుకోలేము కదా!