Telugu Global
National

మోడీ, మ‌మ‌త దొందూ దొందే: రాహుల్‌

పూటకో మాటతో ప్రధాని మోడీ కాలం గడిపేస్తున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఉద్యోగాల కల్పన, ఇతర హామీల ఊసెత్తకుండా కొత్త, కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ‘ఏడాది క్రితం ఢిల్లీలో కొత్త సర్కారు వచ్చింది. ఇక్కడ మమత చేసినట్టుగానే బోలెడు హామీలు గుప్పించింది. ఉపాధి, అభివృద్ధి, కొత్త కంపెనీల గురించి ఇద్దరూ(మోడీ, మమత) మాట్లాడారు. ఇంత‌వ‌ర‌కు ఎంత‌మందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్క‌రు కూడా చెప్ప‌రు. మోడీ, మ‌మ‌త… వీరిద్ద‌రూ క‌బుర్ల‌తో కాలం గ‌డిపేవారే కాని […]

మోడీ, మ‌మ‌త దొందూ దొందే: రాహుల్‌
X
పూటకో మాటతో ప్రధాని మోడీ కాలం గడిపేస్తున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఉద్యోగాల కల్పన, ఇతర హామీల ఊసెత్తకుండా కొత్త, కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ‘ఏడాది క్రితం ఢిల్లీలో కొత్త సర్కారు వచ్చింది. ఇక్కడ మమత చేసినట్టుగానే బోలెడు హామీలు గుప్పించింది. ఉపాధి, అభివృద్ధి, కొత్త కంపెనీల గురించి ఇద్దరూ(మోడీ, మమత) మాట్లాడారు. ఇంత‌వ‌ర‌కు ఎంత‌మందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్క‌రు కూడా చెప్ప‌రు. మోడీ, మ‌మ‌త… వీరిద్ద‌రూ క‌బుర్ల‌తో కాలం గ‌డిపేవారే కాని ప‌నులు చేయ‌ర‌ని రాహుల్ విమ‌ర్శించారు. ‘శుద్ధి గురించి చెప్పారు. ఆ తరువాత చీపురు చేతికి ఇచ్చారు. ఇప్పుడు యోగా పాఠాలు చెబుతున్నారు. కానీ ఉపాధి ఊసెత్తడం లేదు’ అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. పశ్చిమబెంగాల్‌ను అభివృద్ధిబాటలోకి నడిపించగలిగేది కాంగ్రెస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. 34 ఏళ్ల లెఫ్ట్‌ పాలనలో అభివృద్ధికి బ్రేకులు పడ్డాయని, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ప్రజల ఆశలను వమ్ము చేసిందని ఆరోపించారు.
First Published:  7 Jun 2015 3:45 AM GMT
Next Story