సంవత్సరంన్నర తర్వాత ‘సీక్రెట్’గా వెళ్తున్న డైరెక్టర్…!

బాలివుడ్‌లో మూస ఫార్ములాలతో సినిమాలు తయారవుతున్న కాలంలో, పెద్ద తూఫానులా వచ్చి పెద్ద షాక్ ఇచ్చి కొత్త టైప్ సినిమా మజా చూపించింది, తన టెక్నికల్ టేకింగ్‌తో, అండర్‌గ్రౌండ్ కాన్సెప్ట్స్‌తో ఒక్కసారిగా బాలివుడ్‌ని ఒక్క కుదుపు కుదిపాడు. ఒక్క ‘సత్య’తో విజయబావుటా ఎగురవేసాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో…ఒకే ఒక్క ‘ఆగ్’ (షోలే రీమేక్) అతడి డ్రీం రన్‌కి తెర దించేసింది. ఆ మ్యావెరిక్ డైరెక్టరే మన రామ్ గోపాల్ వర్మ. తర్వాత ‘సత్య 2’తో మళ్ళీ ప్రయత్నం చేశాడు.

ఇక ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత ‘సీక్రెట్’గా మళ్ళీ బాలువుడ్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇది తను తెలుగులో తీస్తున్న ‘మొగలిపువ్వు’ సినిమాకి హిందీ వెర్షన్. పెళ్లైన మగాడు, తన సెక్రెటరీతో అక్రమ రిలేషన్‌షిప్‌లో పడడం, అది అతని భార్య దృష్టిలో పడడం.. ఆ తదనంతరం జరిగే పరిణామాలే ఈ సినిమా కథాంశం. ఇందులో సునీల్ జోషి లీడ్ పాత్ర చేస్తున్నాడు. మీరా చోప్రా (బంగారం సినిమా ఫేం) అతని లవర్‌గా చేస్తోంది. ఈ సారి రామ్ రీఎంట్రి విజయవంతం అవ్వాలని కోరుకుందాం.