ఆకర్షించడానికి త్రిషాను అనుసరిస్తున్న అనసూయ

తనకు సంబంధించి మార్కెట్లో క్రేజ్ తగ్గుతుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక వార్తతో మళ్లీ సెన్సేషన్ అవుతుంది యాంకర్ అనసూయ. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్లతో సమానంగా జనాలు చర్చించుకుంటున్న హాట్ ప్రాపర్టీ అనసూయ. ఓవైపు రియాల్టీ షోలతో పాటు మరోవైపు ఆడియో ఫంక్షన్లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. త్రిష టైపులో అనసూయ కూడా టాటూ వేయించుకొని సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మంచు విష్ణు నటించిన డైనమేట్ సినిమా ఆడియో ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది అనసూయ. ఈ ఫంక్షన్ లోనే ఆమె టాటూ బయటపడింది. కనిపించీ కనిపించనట్టున్న ఆ పచ్చబొట్టు ఆడియోకు వచ్చిన అందర్నీ ఇట్టే ఆకర్షించింది. దీంతో మరోసారి హాట్ ఫేవరెట్ అయిపోయింది అనసూయ. రాబోయే రోజుల్లో ఈ గ్లామర్ ఆంటీ ఇంకెన్ని హొయలు పోతుందో చూడాలి.