తిరుపతిలో బాహుబలి ఆడియో

బాహుబలి ఆడియో ఫంక్షన్ కు సంబంధించి ఇంకా చిక్కుముడి వీడలేదు. ఇప్పటికే విడుదలవ్వాల్సిన పాటలు ఇంకా సీడీల్లోనే మగ్గిపోతున్నాయి. భద్రతా కారణలా వల్ల హైదరాబాద్ లో నిర్వహించాల్సిన ఆడియో వేడుక ఇంకా జరగనేలేదు. ఈ లోగా కొన్ని ఆప్షన్లు పరిశీలిస్తున్నాడు రాజమౌళి. ఇందులో భాగంగా విశాఖ బీచ్ లో బాహుబలి ఆడియో నిర్వహించాలని ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే తాజాగా బాహుబలి ఆడియో ఫంక్షన్ ను తిరుపతిలో పెడతారనే ప్రచారం ఊపందుకుంది. నిన్నటివరకు పాటల విడుదల వేడుకను జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఇంకా సెక్యూరిటీ పర్మిషన్లు రానందున వేదికపై సినిమా యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. రామోజీ ఫిలింసిటీలో పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ అక్కడికి వెళ్లాలంటే అభిమానులకు కాస్త కష్టమైన పనే. ఇవన్నీ దృష్టిలోపెట్టుకొని ఫైనల్ గా తిరుపతిని ఖరారుచేయాలని భావిస్తున్నారు. ఈ వీకెండ్ లోనే బాహుబలి పాటల్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.