Telugu Global
Others

హైద‌రాబాద్‌పై నాకూ హ‌క్కుంది: చ‌ంద్ర‌బాబు

నా ఫోన్ ట్యాప్ చేస్తారా… ఆ అధికారం ఎక్క‌డిది? తాను క‌ళ్ళు తెరిస్తే కేసీఆర్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఒక్కో అస్త్రాన్ని ప్ర‌యోగిస్తాన‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. కుట్ర పూరిత డాక్యుమెంట్ల‌తో న‌న్ను బెదిరించ‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌ని, తాను ఏమైనా కేసీఆర్‌కు స‌ర్వెంట్‌నా అత‌ను ఆడ‌మ‌న్న‌ట్ట‌ల్లా ఆడ‌డానికి అని ప్ర‌శ్నించారు. యేడాది పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మ‌హా సంక‌ల్ప దీక్ష కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావుపై […]

హైద‌రాబాద్‌పై నాకూ హ‌క్కుంది: చ‌ంద్ర‌బాబు
X
నా ఫోన్ ట్యాప్ చేస్తారా… ఆ అధికారం ఎక్క‌డిది?
తాను క‌ళ్ళు తెరిస్తే కేసీఆర్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఒక్కో అస్త్రాన్ని ప్ర‌యోగిస్తాన‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. కుట్ర పూరిత డాక్యుమెంట్ల‌తో న‌న్ను బెదిరించ‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌ని, తాను ఏమైనా కేసీఆర్‌కు స‌ర్వెంట్‌నా అత‌ను ఆడ‌మ‌న్న‌ట్ట‌ల్లా ఆడ‌డానికి అని ప్ర‌శ్నించారు. యేడాది పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మ‌హా సంక‌ల్ప దీక్ష కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావుపై నిప్పులు చెరిగారు. నా ఫోన్ ట్యాప్ చేసినందుకు క‌డుపు మండుతోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్ చేయ‌డం నీచాతినీచమ‌ని, సీఎంల ఫోన్‌లే ట్యాపింగ్ చేస్తే దేశంలో మిగిలిన సీఎంల ప‌రిస్థితి ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న‌ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవ‌రిచ్చారని చంద్ర‌బాబు నిల‌దీశారు. తాను భ‌య‌ప‌డి పారిపోయేవాడిని కాద‌ని, నాకు ప్ర‌జ‌లే హై క‌మాండ్ అని, తాను ఎవ‌రికి త‌ల వంచ‌న‌ని, ఎవ‌రి పెత్త‌నాన్ని స‌హించ‌న‌ని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని అన్న విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌ని, ఉమ్మ‌డి రాజ‌ధానిపై మీకు ఎంత హ‌క్కుందో అంత‌క‌న్నా ఎక్కువ మాకూ హ‌క్కుందని ఆయ‌న గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో లా అండ్ ఆర్డ‌ర్ గ‌వ‌ర్న‌ర్ చేతిలో ఉందనే విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌ని, హైద‌రాబాద్‌లో మీకూ పోలీసులున్నారు… మాకు పోలీసులున్నారని, నీకే కాదు… నాకూ ఏసీబీ ఉంది… అదీ హైద‌రాబాద్‌లోనే ఉంది… అని ఆయ‌న గుర్తు చేశారు. త‌ప్పుడు కేసులు పెడితే ఖ‌బ‌డ్దార్ అని ఆయ‌న హెచ్చ‌రించారు.
ఎదుటివారికే నీతులా… నీకు వ‌ర్తించ‌వా?
ఫామ్‌హౌస్‌లో పోలీసు భ‌ద్ర‌త మ‌ధ్య టీడీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన‌పుడు నీవు చెబుతున్న‌ నీతులు ఎమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌ల‌సాని రాజీనామా చేయ‌కుండా మంత్రి ప‌ద‌వి ఎలా ఇచ్చావ‌ని ఆయ‌న నిల‌దీశారు. ఏసీబీ రైడ్‌లు చేస్తారు… క్యాసెట్లు సీఎం కేసీఆర్ విడుద‌ల చేస్తారు… ఇదెక్క‌డి విధాన‌మో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని, తెలుగుదేశం పార్టీపై కేసీఆర్ విషం క‌క్కుతున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. కాంగ్రెస్‌, వైసీపీ, టీఆర్ఎస్ ఒక్క‌టై త‌న‌పై కుట్ర‌లు చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.
First Published:  8 Jun 2015 10:02 AM GMT
Next Story