Telugu Global
NEWS

అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా: చంద్ర‌బాబు

కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోగ‌ల‌మ‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని చంద్ర‌బాబునాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రాల మ‌ధ్య త‌గాదాలొద్ద‌ని తాను అనేక‌సార్లు చెప్పాన‌ని, మూర్ఖుల‌కు హితం చెబితే ఎక్క‌ద‌ని గుంటూరులో ఏర్పాటు చేసిన మ‌హా సంక‌ల్ప దీక్ష కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం విజ‌న్ సాధించ‌డానికే ఈ మ‌హా సంక‌ల్పం దీక్ష అని ఆయ‌న అన్నారు. రాష్ట్ర స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి చంద్ర‌బాబు స‌భ‌కు వ‌చ్చిన అంద‌రితోను ప్ర‌మాణం […]

అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా: చంద్ర‌బాబు
X
కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోగ‌ల‌మ‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని చంద్ర‌బాబునాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రాల మ‌ధ్య త‌గాదాలొద్ద‌ని తాను అనేక‌సార్లు చెప్పాన‌ని, మూర్ఖుల‌కు హితం చెబితే ఎక్క‌ద‌ని గుంటూరులో ఏర్పాటు చేసిన మ‌హా సంక‌ల్ప దీక్ష కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం విజ‌న్ సాధించ‌డానికే ఈ మ‌హా సంక‌ల్పం దీక్ష అని ఆయ‌న అన్నారు. రాష్ట్ర స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి చంద్ర‌బాబు స‌భ‌కు వ‌చ్చిన అంద‌రితోను ప్ర‌మాణం చేయించారు. ఈ భూ మండ‌లంలో మ‌న రాష్ట్రాన్ని క‌ర‌వు ర‌హితంగా మ‌లుచుకుంటాన‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టుని నిర్మించుకుని వృధాగా స‌ముద్రంలోకి పారే నీటిని బీడు భూముల్లోకి మ‌ళ్ళించుకుంటాన‌ని, మా రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికి ఉపాధిక‌ల్పించ‌డానికి ఐటీ మొద‌లైన సేవారంగాల్లో పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించి యువతీయువ‌కుల‌కు మంచి అవ‌కాశాలు వ‌చ్చేట్టుగా చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌తిజ్ఞ చేయించారు. మ‌న దైనందిన జీవితాల్లో ఆధునిక‌, శాస్త్ర, సాంకేతిక‌త ప్ర‌వేశ‌పెట్టి పేద‌రికం, నిర‌క్ష్య‌రాస్య‌త‌, అనారోగ్యం,అప‌రిశుభ్ర‌ద‌త‌పై రాజీలేని పోరాటంతో చేయాల‌ని చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు.
అంద‌రూ క‌లిస్తేనే స్వ‌ర్ణాంధ్ర: గ‌వ‌ర్న‌ర్‌
అమరావతి స్వర్ణభూమి… ఇది ఏపీ ప్రజల అదృష్టమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్ అన్నారు. మహా సంకల్ప సభ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, క‌ల‌సి ప‌ని చేస్తేనే మ‌హా సంక‌ల్పాన్ని సాధించ‌గ‌ల‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. ఏపీ అభివృద్ధికి యువత ముందుకు రావాలని, ఈ స్వర్ణభూమికి మళ్లీ రావాలని కోరుకుంటున్నానని గవర్నర్‌ నరసింహన్ అన్నారు. రాష్ట్ర ప్ర‌గ‌తికి యువ‌త ముందుకు రావాల‌ని గ‌వ‌ర్న‌ర్ పిలుపు ఇచ్చారు. కాగా 2050 నాటికి ప్ర‌పంచంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు సాధించాల‌నుకుంటున్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు క‌ల సాకార‌మ‌వ్వాలంటే మ‌న‌మంతా మ‌హా సంక‌ల్పం చెప్పాల‌ని ఏపీ ప్ర‌భుత్వ చీఫ్ విప్ కాల‌వ శ్రీ‌నివాసులు పిలుపు ఇచ్చారు.
యేడాది పాల‌న‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల‌
గుంటూరులో మ‌హా సంక‌ల్ప‌స‌భ ప్రారంభానికి ముందు యేడాది పాల‌న‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా మ‌హాసంక‌ల్పం తెలుగు, ఇంగ్లీషు పుస్త‌కాల ప్ర‌తుల‌ను ఆవిష్క‌రించారు. సంకల్పదీక్ష సందర్భంగా జాతీయ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విదించారు. సభ ముగిసే వరకు విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు నిలిపి వేశారు. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఎక్కడి వాహనాలు అక్క‌డే స్తంభించిపోయాయి. మా తెలుగుత‌ల్లికి మ‌ల్లెపూదండ అనే ప్రార్థ‌నాగీతంతో స‌భ ప్రారంభ‌మైంది. ప్ర‌జ‌ల‌తో మ‌హాసంక‌ల్పదీక్ష ప్ర‌తిజ్ఞ చేయించిన చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని స‌భ‌ను కోరారు. మ‌హా సంక‌ల్పం స‌భాధ్య‌క్షుడిగా ఐవైఆర్ కృష్ణారావు వ్య‌వ‌హ‌రించారు.
First Published:  8 Jun 2015 10:09 AM GMT
Next Story