Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు సెట్ అయింది

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా థియేటర్లలోకి వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఎన్టీఆర్ కనుక అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే సన్నాఫ్ సత్యమూర్తి కంటే ముందే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా విడుదలయ్యేది. మొత్తమ్మీద ఇన్నాళ్లు సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్ పక్కా అయింది. యంగ్ టైగర్ ను డిఫరెంట్ గా చూపించాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ రాసుకున్న కథకు […]

ఎట్టకేలకు సెట్ అయింది
X
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా థియేటర్లలోకి వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఎన్టీఆర్ కనుక అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే సన్నాఫ్ సత్యమూర్తి కంటే ముందే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా విడుదలయ్యేది. మొత్తమ్మీద ఇన్నాళ్లు సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్ పక్కా అయింది. యంగ్ టైగర్ ను డిఫరెంట్ గా చూపించాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ రాసుకున్న కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో.. త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనే సస్పెన్స్ కు ఈ న్యూస్ తో తెరపడింది.
సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ మరోసారి పవన్ తోనే సెట్స్ పైకి వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ గబ్బర్ సింగ్-2తో బిజీ అయిపోయాడు. పోనీ.. బన్నీతోనే మరో సినిమా లాగించేద్దామంటే బోయపాటి శ్రీను అడ్డుపడ్డాడు. ఈ టైమ్ లో ఎన్టీఆర్ మూవీ కన్ ఫర్మ్ అయింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు తారక్.
First Published:  8 Jun 2015 1:51 AM GMT
Next Story