Telugu Global
Cinema & Entertainment

బాహుబలి హేటర్స్‌ని తగ్గించేసిన చెర్రీ

బాలివుడ్, కోలివుడ్, స్యాండల్‌వుడ్ మరియు టాలివుడ్..ఏ ఇండస్ట్రీ అయినా ఒక్కటే. స్టార్స్ ఫ్యాన్స్ మధ్య వార్ కామన్ అయిపోయింది. అభిమానం ముదిరిపోయి… సాటి అభిమానులను ద్వేషించడం అనే విష సంస్కృతి పెరిగిపోతుంది. బాహుబలి వంటి సినిమా కేవలం స్టార్స్ కోసం తీసినది కాదు. మన తెలుగు వారందరిది. మన తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్న సినిమా. అయినా ఈ సినిమాకి సైతం హేటర్స్ అంటూ బయలుదేరితే ఇక అర్థం ఉండదు. మన స్టార్స్ యొక్క […]

బాహుబలి హేటర్స్‌ని తగ్గించేసిన చెర్రీ
X

బాలివుడ్, కోలివుడ్, స్యాండల్‌వుడ్ మరియు టాలివుడ్..ఏ ఇండస్ట్రీ అయినా ఒక్కటే. స్టార్స్ ఫ్యాన్స్ మధ్య వార్ కామన్ అయిపోయింది. అభిమానం ముదిరిపోయి… సాటి అభిమానులను ద్వేషించడం అనే విష సంస్కృతి పెరిగిపోతుంది. బాహుబలి వంటి సినిమా కేవలం స్టార్స్ కోసం తీసినది కాదు. మన తెలుగు వారందరిది. మన తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్న సినిమా.

అయినా ఈ సినిమాకి సైతం హేటర్స్ అంటూ బయలుదేరితే ఇక అర్థం ఉండదు. మన స్టార్స్ యొక్క వ్యక్తిగత రికార్డ్స్ కన్నా, మన తెలుగు వాడైన రాజమౌళి సాధించబోయే రికార్డ్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకు ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ అండ ఫుల్‌గా ఉంటుంది. ఇక నిన్నటి రోజున రామ్ చరణ్ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ‘బాహుబలి’ని ఆకాశానికి ఎత్తేసాడు. అంటే మెగా అభిమానులు కూడా మన ఎపిక్ స్థాయి మూవీకి హారతులు పడతారు. ఇలా అందరు స్టార్ హీరోలు గనుక చేస్తే…బాహుబలి హేటర్స్ ఎవరూ ఉండరు కదా! ఏమంటారు?

First Published:  8 Jun 2015 6:18 AM GMT
Next Story