Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ కాదు.. బిజినెస్ ఉమెన్

మాధవీలత పేరును చాలామంది మరిచిపోయి ఉండొచ్చు. నచ్చావులే సినిమాతో పాపులర్ అయిన ఈ భామ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పెద్దగా హైట్ లేకపోవడం, ఫీచర్లు కూడా తక్కువగా ఉండడంతో మాధవీలతను తెలుగు ఇండస్ట్రీ చాలా ఈజీగా పక్కనపెట్టేసింది. దీంతో మాధవీలత హీరోయిన్ ఛాన్స్ లు వదిలేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఆమధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది.. కానీ కొన్ని కారణాల వల్ల అది పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు మరో కొత్త రంగంలోకి […]

హీరోయిన్ కాదు.. బిజినెస్ ఉమెన్
X

మాధవీలత పేరును చాలామంది మరిచిపోయి ఉండొచ్చు. నచ్చావులే సినిమాతో పాపులర్ అయిన ఈ భామ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పెద్దగా హైట్ లేకపోవడం, ఫీచర్లు కూడా తక్కువగా ఉండడంతో మాధవీలతను తెలుగు ఇండస్ట్రీ చాలా ఈజీగా పక్కనపెట్టేసింది. దీంతో మాధవీలత హీరోయిన్ ఛాన్స్ లు వదిలేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఆమధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది.. కానీ కొన్ని కారణాల వల్ల అది పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు మరో కొత్త రంగంలోకి ఎంటరైంది మాధవీలత. అందర్నీ షాక్ కు గురిచేస్తే ఏకంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టింది. సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టడం అంటే రెగ్యులర్ బిజినెస్ లాంటిది కాదు. దానికి ఎన్నో లెక్కలు, మరెన్నో సమీకరణాలు కావాలి. అవన్నీ లెక్కలేసుకునే హైదరాబాద్ నగర శివార్లలో సాప్ట్ వేర్ కంపెనీ పెట్టింది మాధవీలత. ప్రస్తుతం ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. చూస్తుంటే.. మాధవీలతతో పాటు ఇంకెవరో కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా మాధవీలతకు ఈ సాఫ్ట్ వేర్ బిజినెస్ ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.

First Published:  8 Jun 2015 11:54 PM GMT
Next Story