Telugu Global
Cinema & Entertainment

చాన్నాళ్ల తర్వాత హ్యాట్రిక్ కు రెడీ

నాగార్జున-లారెన్స్ బంధం గురించి ఏ తెలుగు ప్రేక్షకుడ్ని అడిగినా చెబుతాడు. కేవలం కొరియోగ్రాఫర్ గానే లారెన్స్ ను చూడలేదు నాగార్జున. అతడికి దర్శకుడిగా అవకాశం కూడా ఇచ్చాడు. అలా వాళ్లిద్దరి కాంబినేషన్ లో మాస్, డాన్ సినిమాలొచ్చాయి. వీటిలో మాస్ సినిమా మంచి హిట్టయితే.. డాన్ సినిమా యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాకు రంగం సిద్ధమౌతోంది. రీసెంట్ గా కాంచన-2 సినిమాతో మాస్ హిట్ అందుకున్న లారెన్స్ కు నాగ్ […]

చాన్నాళ్ల తర్వాత హ్యాట్రిక్ కు రెడీ
X

నాగార్జున-లారెన్స్ బంధం గురించి ఏ తెలుగు ప్రేక్షకుడ్ని అడిగినా చెబుతాడు. కేవలం కొరియోగ్రాఫర్ గానే లారెన్స్ ను చూడలేదు నాగార్జున. అతడికి దర్శకుడిగా అవకాశం కూడా ఇచ్చాడు. అలా వాళ్లిద్దరి కాంబినేషన్ లో మాస్, డాన్ సినిమాలొచ్చాయి. వీటిలో మాస్ సినిమా మంచి హిట్టయితే.. డాన్ సినిమా యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాకు రంగం సిద్ధమౌతోంది. రీసెంట్ గా కాంచన-2 సినిమాతో మాస్ హిట్ అందుకున్న లారెన్స్ కు నాగ్ నుంచి పిలుపువచ్చింది. ఓ మంచి స్టోరీ ఉంటే చెప్పమని కోరాడు నాగార్జున. వెంటనే లారెన్స్ ఓ స్టోరీలైన్ అనుకోవడం.. దాన్ని నాగ్ ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ స్టోరీలైన్ ను స్క్రీన్ ప్లేగా మలిచే పనిలో లారెన్స్ బిజీగా ఉన్నాడు. దీంతోపాటు తెలుగులో కల్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమాను తమిళ్ లో తనే హీరోగా తెరకెక్కిస్తున్నాడు. పటాస్ తమిళ వెర్షన్ పూర్తయిన వెంటనే తెలుగులో మన్మధుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి స్కెచ్ రెడీచేస్తున్నాడు లారెన్స్. గత రెండు సినిమాల్లో హీరోయిన్లను తనే సెలక్ట్ చేసుకున్నాడు లారెన్స్. అయితే ఈసారి మాత్రం హీరోయిన్ల ఎంపికను నాగార్జునకే వదిలేశాడు.

First Published:  8 Jun 2015 11:48 PM GMT
Next Story