Telugu Global
Cinema & Entertainment

చుల్ బులీ ఫోకస్ ఇప్పుడు తమిళ్ పైనే..

తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికే ఓ చూపు చూసేసింది సమంత. వరుసపెట్టి సినిమాలు చేసింది. అంతే స్థాయిలో విజయాలు కూడా అందుకుంది. ప్రస్తుతం చెప్పాలంటే తెలుగులో సమంతానే నంబర్ వన్. అందుకే ఇప్పుడు తన ఫోకస్ ను తమిళ చిత్రసీమపై పెట్టింది సమంత. తన మాతృభాష అయిన తమిళనాట సత్తా చాటాలని భావిస్తోంది. అందుకే కాస్త తెలుగుసినిమాలు తగ్గించి, కాల్షీట్లన్నీ కోలీవుడ్ చిత్రాలకే కేటాయిస్తోంది. ఇప్పటికే కొంతమంది స్టార్లతో తమిళ సినిమాలు చేసిన సమంత, ఇప్పుడు మరింత మందితో […]

చుల్ బులీ ఫోకస్ ఇప్పుడు తమిళ్ పైనే..
X

తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికే ఓ చూపు చూసేసింది సమంత. వరుసపెట్టి సినిమాలు చేసింది. అంతే స్థాయిలో విజయాలు కూడా అందుకుంది. ప్రస్తుతం చెప్పాలంటే తెలుగులో సమంతానే నంబర్ వన్. అందుకే ఇప్పుడు తన ఫోకస్ ను తమిళ చిత్రసీమపై పెట్టింది సమంత. తన మాతృభాష అయిన తమిళనాట సత్తా చాటాలని భావిస్తోంది. అందుకే కాస్త తెలుగుసినిమాలు తగ్గించి, కాల్షీట్లన్నీ కోలీవుడ్ చిత్రాలకే కేటాయిస్తోంది. ఇప్పటికే కొంతమంది స్టార్లతో తమిళ సినిమాలు చేసిన సమంత, ఇప్పుడు మరింత మందితో కలిసి నటించేందుకు సిద్ధమౌతోంది. సూర్యతో 24 అనే సినిమాకు మళ్లీ కాల్షీట్లు కేటాయించింది. అటు ధనుష్ సరసన వరుసగా రెండోసారి నటించేందుకు సిద్ధమౌతోంది. మరోవైపు విజయ్ చిత్రంలో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ఇలా ఒకేసారి తమిళ అగ్రహీరోలందర్నీ లైన్ లో పెట్టింది చుల్ బులీ. ప్రస్తుతం తమిళనాట హన్సిక హవా కొనసాగుతోంది. అరడజనుకు పైగా సినిమాలున్నాయి హన్సిక చేతిలో. ఆమె హవాకు గండికొట్టి కోలీవుడ్ లో కూడా నంబర్ వన్ అనిపించుకోవడానికి పక్కా ప్లాన్ తో దూసుకుపోతోంది సమంత.

First Published:  9 Jun 2015 2:43 AM GMT
Next Story